బాబుతో యార్లగడ్డ ! టీడీపీ లో చేరేది ఎప్పుడంటే ? 

గత కొంతకాలంగా ఏపీలోని గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ గందరగోళం గురించి తెలిసిందే .2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన వల్లభనేని వంశీ( Vallabhaneni Vamsi ) ఆ తర్వాత వైసిపికి దగ్గర కావడంతో ఇక్కడ వివాదం మొదలైంది.ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వంశీ పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు( Yarlagadda Venkatrao ) వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చారు.జగన్ ఆయనను బుజ్జగిస్తూ వచ్చారు.

 Ycp Leader Yarlagadda Venkatrao To Meet Chandrababu Naidu Details, Yarlagadda Ve-TeluguStop.com

అయితే వచ్చే ఎన్నికల్లో వైసిపి గన్నవరం అభ్యర్థిగా వంశీ ఉంటారంటూ వైసీపీ అధిష్టానం పెద్దలు ప్రకటించడంతో,  యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ,  పార్టీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బహిరంగంగా స్పందించారు.పార్టీలో తనకు జరిగిన అవమానాలను వెల్లడించారు .అధికార పార్టీలో ఉండి కూడా తనపై కేసులను తీయించుకోలేకపోయానని,  కనీసం జగన్ అపాయింట్మెంట్ కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ అది లభించడం లేదని, పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టానని , అయినా తనను పోతే పో అన్నట్లుగా వైసీపీ పెద్దలు మాట్లాడారని వెంకట్రావు ఆవేదన చెందారు.

Telugu Ap Cm Jagan, Chandrababu, Gannavaram-Politics

తన అనుచరుల ఆత్మీయ సమ్మేళనం లోనే బహిరంగంగా చంద్రబాబు( Chandrababu Naidu ) అపాయింట్మెంట్ కోరారు.దీంతో ఆయన టిడిపిలో చేరిపోతున్నారనే విషయం అందరికీ అర్థమైంది.ఈ మేరకు చంద్రబాబు అపాయింట్మెంట్ వెంకటరావుకు లభించింది.

ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో యార్లగడ్డ వెంకట్రావు బేటి కాబోతున్నారు.ఈ భేటీ నేపథ్యంలో తన ముఖ్య అనుచరులతో కలిసి యార్లగడ్డ హైదరాబాద్( Hyderabad ) చేరుకున్నారు .ఈనెల 22వ తేదీన గన్నవరంలో జరగబోయే భారీ బహిరంగ సభలో వెంకట్రావు టిడిపి( TDP ) కండువా కప్పుకోబోతున్నారు.అయితే ఆయన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరుతారా లేక బహిరంగ సభ ఏర్పాటు చేసి చంద్రబాబునే అక్కడికి ఆహ్వానించి.

ఆయన సమక్షంలో పార్టీలో చేరుతారా అనేది తేలాల్సి ఉంది   ఈ విషయంపై ఈరోజు క్లారిటీ రానుంది.

Telugu Ap Cm Jagan, Chandrababu, Gannavaram-Politics

వెంకట్రావుకు గన్నవరం టికెట్ ను ఇస్తామని చంద్రబాబు ప్రకటిస్తే … ఈ నియోజకవర్గంలో మళ్లీ పాత ప్రత్యర్థుల మధ్య నే పోటీ ఉండబోతోంది .ఇక వల్లభనేని వంశీ తరచుగా టిడిపి పైన , ఆ పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో , వంశీని 2024 ఎన్నికల్లో గెలవకుండా చేయాలనే పట్టుదలతో టిడిపి అధిష్టానం ఉంది.వంశీకి బలమైన ప్రత్యర్థిగా వెంకట్రావు ఉంటారని అంచనాకు వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube