సోషల్ మీడియాతో( Social Media ) నేటి మనిషి బంధం తోటి మనిషి కంటే కూడా ఎక్కువగా పెనువేసుకు పోతోంది.ఎంతలాగ అంటే స్మార్ట్ ఫోన్ తో కాపురం చేసేటంత.
అవును, నిజమే.మనలో చాలామంది పగలు వాడుతారు సరే, రాత్రిళ్ళు కూడా మొబైల్ ని పక్కనే పెట్టుకొని పాడుకుంటూ వుంటారు.
నిపుణులు అలా చేయవద్దని చెప్పినా వీరికి వినపడదు.రేడియేషన్ మమ్మల్ని ఏం చేస్తుంది అనుకుంటారేమో మరి.ఇక ఆ సంగతి పక్కనబెడితే సోషల్ మీడియాలో యువత చిత్తవుతోంది.ఇక్కడ ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు పోస్ట్ చేయబడతాయి.

ఈమధ్య కాలంలో చూసుకుంటే బైక్ స్టంట్స్ కి( Bike Stunts ) సంబందించిన వీడియోలు మనం ఎక్కువగా చూస్తూ వున్నాము.అయితే కుర్రాళ్ళు ఇలాంటి స్టంట్స్ చేయడం మీరు చూసే వుంటారు.ఓ వృద్ధుడి( Old Man ) స్టంట్స్ చేయడం ఎపుడైనా చూసారా? బహుశా చూసి వుండరు కదా.అయితే ఇక్కడ వైరల్ వీడియోని మీరు చూశారంటే అవాక్కవుతారు.ఇక్కడ వీడియోలో ఒక వృద్ధుడు తన వింత వ్యక్తిత్వాన్ని చూపించాడు.బైక్‌పై అద్భుతమైన విన్యాసాలు చేస్తూ కుర్రాళ్ళకి సైతం సవాలు విసిరాడు.బైక్ విన్యాసాలు చేయడానికి ప్రాణాలను సైతం పణంగా పెట్టే స్థాయికి అతడి పిచ్చి పెరిగిపోయిందని తెలుస్తోంది.

ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్ అవుతోంది.ఇందులో తెల్లటి గడ్డంతో, తెల్లటి కుర్తా పైజామాతో ఓ వృద్ధుడు బైక్‌పై విన్యాసాలు చేస్తూ ఉండడం మీరు గమనించవచ్చు.ఈ క్రమంలో అతడు ఒక సారి బైక్ హ్యాండిల్ మీద నుంచి చేయి తీసి బైక్ నడుపుతాడు, ఒక సారి బైక్ వెనుక పడుకుని బైక్ మీద చేతులు పైకెత్తి అటు ఇటు ఉయ్యాల ఊగుతున్నాడు.
కాగా దీనిని బైక్ వెనుక ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఈ వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.
కాగా దీనికి విపరీతమైన వ్యూస్, లైక్‌లు వచ్చాయి.దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
కొందరు అతగాడిని పొగిడితే మరికొందరు మాత్రం ‘ఈ ముసలితనానికి ఇది అవసరమా?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.







