ఒక సినిమాని మనం చూసినప్పుడు ఆ సినిమా ఎంత మంచి విజయం సాధిస్తుంది అనేది మనం ముందే చెప్పలేం కానీ ఆ సినిమా చూస్తున్నంత సేపు మనల్ని ఎంటర్టైన్ చేస్తే సరిపోతుంది.నిజానికి ఇది ప్రతి సినిమా కి వర్తిస్తుంది సినిమా రొటీన్ గా ఉన్న కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తే ఆ సినిమా సూపర్ గా ఆడుతుంది అనే దానికి బెస్ట్ ఎగ్జామ్ ఫుల్ గా రవితేజ ( Ravi Teja ) హీరో గా వచ్చిన ధమాకా సినిమా ని చెప్పవచ్చు ఈ సినిమా రొటీన్ కమర్షియల్ సినిమా అయినా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద భారీ విజయం సాధించింది…ఇక దానికితోడు ఈ సినిమా 100 కోట్ల కలక్షన్స్ ని కూడా రాబట్టింది.ఇక ఈ సినిమా తోపాటు డైరెక్టర్ త్రినాధ్ రావు నక్కిన( Trinadha Rao Nakkina ) తీసిన ప్రతి సినిమా కూడా రొటీన్ గానే ఉన్నప్పటికీమంచి విజయాలను అందుకుంటాయి…

ఇక ఈ సినిమానే కాకుండా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ( Kalyan Krishna ) తీసిన సినిమాలు కూడా చాలా రొటీన్ గా ఉంటూనే మంచి విజయాలను అందుకుంటాయి.దీనికి కారణం వాళ్ళు స్టోరీ మీద కాకుండా ట్రీట్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు అందుకే వాళ్ళకి మంచి విజయాలు దక్కుతాయి…ప్రతి హీరో ఇమేజ్ కి తగ్గట్టు గా కథలు చేస్తూ వాళ్ళకి మంచి హిట్లు ఇస్తుంటారు.

ఇక వీళ్ళతో పాటు రొటీన్ సినిమాలు తీస్తూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం లో బోయపాటి శ్రీను( Boyapati Srinu ) ఒకరు.ఈయన తీసిన ప్రతి సినిమా కూడా రొటీన్ గా ఉన్నప్పటికీ మాస్ ఆడియన్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఈయన తీసే సినిమాలు అందరికి నచ్చుతాయి… అందుకే వీళ్ళందరూ కూడా మంచి డైరెక్టర్లు గా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు…నిజానికి మన తెలుగు లో మాస్ సినిమాలు బతకడానికి వీళ్లు కూడా ఒక కారణం అనే చెప్పాలి…