బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ( CM kcr )ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో ఊహించడం కష్టం.ఆయన వ్యూహాలు, ప్రణాళికలు ఎవరికి అంతు చిక్కవు.
అందుకే ప్రత్యర్థి పార్టీ నేతలైనా సొంత పార్టీ నేతలైనా గులాబీ బాస్ వైఖరిపై ఆందోళనగా ఉంటారు.ఇక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో సీట్ల కేటాయింపుపై తుది మెరుగులు దిద్దుతున్నా కేసిఆర్ మొదటి లిస్ట్ ను త్వరలోనే ప్రకటించేందుకు సిద్దమౌతున్నారు.
దీంతో కేసిఆర్ లిస్ట్ లో ఎవరెవరూ ఉండబోతున్నారనే చర్చ జరుగా సాగుతోంది.దాదాపు 90 శాతం సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రదాన్యత అనే టాక్ వినిపిస్తుండడంతో ప్రస్తుతం ఎమ్మెల్సీలు గా కొనసాగుతున్నవారు, అలాగే టికెట్ ఆశించి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారట.

తాజాగా బిఆర్‌ఎస్( BRS party ) తొలి అభ్యర్థుల జాబితాలో కొందరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నుంచి జాన్సన్ నాయక్,( Johnson Nayak ) బోథ్ నుంచి అనిల్ జాదవ్( Anil Jadhav ) వంటి వారికి టికెట్లు దాదాపు ఖాయమనినట్లు తెలుస్తోంది.ఆసిఫాబాద్ టికెట్ కూడా కేసిఆర్ దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.ఆసిఫాబాద్ టికెట్ ను కోవా లక్ష్మికి ఖరారు చేసినట్లు టాక్.అయితే ఈ సీటును ఆత్రం సక్కు ఆశించారు.కానీ కేసిఆర్ మాత్రం కోవా లక్ష్మి వైపే మొగ్గు చపరట.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కు గెలుపొందారు.ఆ సమయంలో ఆయన ప్రత్యర్థిగా బిఆర్‌ఎస్ నుంచి కోవా లక్ష్మి నిలుచున్నారు.
అయితే ఆ తరువాత ఆత్రం సక్కు( Athram Sakku ) కూడా బిఆర్‌ఎస్ లో చేరడంతో ఆసిఫాబాద్ టికెట్ పై రగడ మొదలైంది.

కాగా ఈ నియోజికవర్గం టికెట్ తనకే వస్తుందని భావించిన ఆత్రం సక్కు కు కేసిఆర్ షాక్ ఇచ్చారట.దీంతో ఆయన కాంగ్రెస్ కు వెలతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఆత్రం సక్కు కు పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేసినట్లు సమాచారం.
దీనిపై ఆయన పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని, అందుకే ఆయన బిఆర్‌ఎస్ ను వీడే ఆలోచన చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ప్రస్తుతం ఆసిఫాబాద్ లో ఆత్రం సక్కు కంటే కూడా కోవా లక్ష్మికే ప్రజాధరణ ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడిందట.
అందుకే గత ఎన్నికల్లో ఆమె ఓటమిపాలు అయినప్పటికి మళ్ళీ ఆమెకే టికెట్ ఇచ్చేందుకు కేసిఆర్ సుముఖత చూపించినట్లు తెలుస్తోంది.







