Gmail లో వచ్చిన ఈమెయిల్ లను( Emails ) నేరుగా మీకు నచ్చిన భాషలో అనువాదం చేసుకొని చక్కగా చదువుకునే సరికొత్త ఫీచర్ జీమెయిల్ యాప్ లో అందుబాటులోకి వచ్చింది.గతంలో జీమెయిల్ వెబ్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఫీచర్ ప్రస్తుతం జీమెయిల్ యాప్ లో అందుబాటులోకి వచ్చింది.
ఈ సరికొత్త ఫీచర్ iOS, ఆండ్రాయిడ్ లలో విడుదల చేస్తున్నట్లు గూగుల్ తన బ్లాగ్ లో తెలిపింది.
యూజర్లు చాలా సంవత్సరాల నుండి జీమెయిల్ వెబ్ వర్షన్ లో సుమారుగా 100 భాషలలో ట్రాన్సిలేషన్ చేసుకోగలుగుతున్నారు.
ఈ ఫీచర్ ప్రస్తుతం జీమెయిల్ యాప్ లో( Gmail App ) సొంత భాషలలో యూజర్లు తమ మెయిల్ అనువాదం చేసుకొని చదవవచ్చని గూగుల్ ( Google ) తన బ్లాగ్ లో ఓ పోస్ట్ చేసింది.యూజర్లకు అర్థం కాని భాషలో మెయిల్ వస్తే దానిని వచ్చిన భాషలోకి అంటే సొంత భాషలోకి అనువాదం చేసుకొని అర్థం చేసుకోవచ్చని గూగుల్ పేర్కొంది.

మనకు తెలియని భాషలో వచ్చిన మెయిల్ కు చెందిన భాషను కూడా ఈ ఫీచర్ ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది.ఉదాహరణకు ఫ్రెంచ్ భాషలో ఏదైనా మెయిల్ వస్తే యూజర్లు కేవలం ఇంగ్లీష్ ( English ) మాత్రమే అర్థం చేసుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటే అక్కడ కనిపించిన టాప్ టు ఇంగ్లీష్ పైన క్లిక్ చేసి, మెయిల్ ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసుకొని చదువుకోవచ్చు.ఈ ఫీచర్ ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం.ముందు జీమెయిల్ యాప్ ను ఓపెన్ చేయాలి.ఏ మెయిల్ ను అనువాదం చేయాలని అనుకుంటున్నారో దానిని ఎంపిక చేసుకోవాలి.

కుడి వైపున కనిపిస్తున్న మూడు చుక్కల లైన్ పై టాప్ చేయాలి.అక్కడ సెలెక్ట్ ట్రాన్సిలేట్( Select Translator ) ఎంపిక చేసుకొని, తర్వాత మీకు నచ్చిన భాషను ఎంచుకుంటే ఆ భాషలోకి మారుతుంది.యూజర్లు అవసరం లేని సమయంలో మెయిల్ ట్రాన్సిలేట్ బ్యానర్ ను ఆఫ్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ప్రస్తుతం కొంతమందికి మాత్రమే అందుబాటులోకి వచ్చింది.త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఫీచర్ కావాలంటే జీమెయిల్ యాప్ ను అప్డేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ ఫీచర్ అందుబాటులో లేకుంటే కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుంది.







