కట్టుకున్న భార్యను కర్కశంగా కడతేర్చాడు ఓ భర్త.ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో చోటు చేసుకుంది.
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న భార్య సంధ్యపై భర్త రాంబాబు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.అనంతరం ఘటనా స్థలం నుంచి పరార్ అయ్యాడని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా భర్త రాంబాబు చోరీలకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది.రాంబాబు ప్రవర్తనతో విసుగు చెందిన సంధ్య విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలోనే రాంబాబుకు దూరంగా ఉంటూ వస్తుంది.దీంతో కోపోద్రిక్తుడైన రాంబాబు రోడ్డుపై వెళ్తున్న సంధ్యను కత్తితో పొడిచి పరార్ అయ్యాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







