సాధారణంగా కొందరి జుట్టు( Hair ) చాలా పల్చగా ఉంటుంది.ఇటువంటివారు ఎలాంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు.
ఈ క్రమంలోనే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు తోచిన చిట్కాలు ప్రయత్నిస్తుంటారు.జుట్టుపై ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
ఆయిల్ దగ్గర నుంచి షాంపూ వరకు ఖరీదైన ఉత్పత్తులను వాడుతుంటారు.అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఎంతో బాధ కలుగుతుంది.
కానీ ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కనుక పాటిస్తే నెల రోజుల్లో మీ జుట్టు డబుల్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఆపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు కలబంద ఆకు పొడిని వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ తో పాటు వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే హెయిర్ గ్రోత్( Hair Growth ) అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.అదే సమయంలో జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.కొద్ది రోజుల్లోనే మీ కురులు ఒత్తుగా మారతాయి.
కాబట్టి ఒత్తైన జుట్టును కోరుకునేవారు ఈ రెమెడీ ని అస్సలు మిస్ అవ్వకండి.పైగా ఈ రెమెడీ వల్ల చుండ్రు సమస్య( Dandruff ) దూరం అవుతుంది.
తలలో దురద, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే నయం అవుతాయి.మరియు జుట్టు కుదుళ్లు సైతం దృఢంగా మారతాయి.







