భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి.నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె ప్రొఫెసర్ గుమ్మడి అనురాధ రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్లెక్సీలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
మరోవైపు అనురాధ పొలిటికల్ ఎంట్రీ ఇష్టం లేని వర్గానికి చెందిన కొందరు ఫ్లెక్సీలను చించివేయడం వివాదాస్పదంగా మారింది.ఇల్లందు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మడి నర్సయ్య వారసత్వాన్ని కొనసాగించాలని డిమాండ్ వినిపిస్తోంది.
అయితే గుమ్మడి అనురాధ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలో ఆమెను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆశావహులు ఒక్కసారిగా ఖంగుతిన్నారని తెలుస్తోంది.
మరోవైపు బయ్యారంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.టేకులపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పోలీసులు బెదిరిస్తున్నారని అనురాధ వర్గీయులు ఆరోపిస్తున్నారు.
దీంతో ఇల్లందు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.