హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) భారతదేశంలో OBD-2 కంప్లైంట్ 2023 హోండా లివో బైక్( Honda Livo 2023 )ని విడుదల చేసింది.కొత్త లివో బైక్ డ్రమ్, డిస్క్ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.డ్రమ్ వేరియంట్ ధర రూ.78,500, డిస్క్ వేరియంట్ ధర రూ.82,500 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.OBD-2 (ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్) సిస్టమ్ అనేది టెక్ నిపుణులను మోటార్‌సైకిల్ కంప్యూటర్‌లోని లోపాలను స్కాన్ చేయడానికి అనుమతించే ఒక డయాగ్నోస్టిక్ టూల్.ఇది పెద్ద నష్టాన్ని కలిగించే ముందు సమస్యలను ముందుగానే గుర్తించి, పరిష్కరించడంలో సహాయపడుతుంది.లివో భారతదేశంలో OBD-2కి అనుగుణంగా ఉన్న మొదటి హోండా మోటార్‌సైకిల్.

OBD-2 సిస్టమ్‌తో పాటు కొత్త లివో( Honda Livo Features ) కొత్త గ్రాఫిక్స్, రీడిజైన్డ్ ఫ్రంట్ వైజర్‌తో సహా కొన్ని బ్యూటీ అప్‌డేట్స్ కూడా పొందుతుంది.మెకానికల్‌గా మోటార్‌సైకిల్‌లో పెద్దగా మార్పులేమీ చేయలేదు.ఇది మునుపటి వెర్షన్ అందించినట్లే 110cc, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో 8.67 hp, 9.30 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.లివో మూడు అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, మ్యాట్ క్రస్ట్ మెటాలిక్, బ్లాక్ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఇది ప్రామాణిక 3-సంవత్సరాల వారంటీతో కూడా వస్తుంది, అదనపు మొత్తాన్ని చెల్లించడం ద్వారా 7 సంవత్సరాలకు పొడిగించవచ్చు.

కొత్త లివో విడుదలపై హోండా మోటార్‌సైకిల్( Honda Motorcycle ), స్కూటర్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ యద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ, “లివో దాని ఫ్యూయల్ సామర్థ్యం, సౌకర్యవంతమైన ప్రయాణం, స్టైలిష్ డిజైన్‌తో భారతదేశంలోని వినియోగదారులలో బెస్ట్ ఛాయిస్ అయ్యింది.కొత్త OBD-2 కంప్లైంట్ లివో దాని అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో మోటార్‌సైకిల్ ఆకర్షణను మరింత మెరుగుపరుస్తుంది.” అని అన్నారు.ఎక్కువ మైలేజ్ అందించే స్టైలిష్ మోటార్‌సైకిల్ కోసం వెతుకుతున్న ప్రయాణికులకు కొత్త హోండా లివో మంచి ఎంపిక.దీనికి బలమైన వారంటీ కూడా మద్దతు ఇస్తుంది.







