ప్రపంచవ్యాప్తంగా ఇటీవల విమాన ప్రమాదాలు( Flight Accidents ) పెరిగిపోతూ ఉన్నాయి.ఈ క్రమంలో వందలాది మంది ప్రయాణికులు ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి.
ఒక్కోసారి టెక్నికల్ ప్రాబ్లం మరోసారి వాతావరణం అనుకూలించకపోవడంతో విమాన ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా మలేషియాలో( Malaysia ) రోడ్డుపై విమానం కూలిపోయింది.
ఈ ఘటనలో విమానంలో ఉన్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది.

ఈ ఘటన మలేషియాలోని కౌలంపూర్( Kaulalampur ) సమీపంలో ఎక్స్ప్రెస్ హైవే పై జరిగింది.లాంగ్ కావి విమానాశ్రయం నుండి సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా వెళుతున్న ఈ చార్టెడ్ విమానంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం.ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించడంతో మొత్తం ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందడం జరిగింది.ఆకాశం నుంచి ఒక్కసారిగా ఉడి పడినట్లు విమానం రోడ్డుపై కూలటంతో ఒక్కసారిగా విస్ఫోటనం సంభవించి ఆకాశం మొత్తం నల్లటి పొగ అలుముకుంది.
రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.అయితే ఈ మొత్తం ప్రమాదం ఒక కారు డ్యాష్ కెమెరాలో రికార్డు అయింది.








