భారతీయుల వాస్తు, నిర్మాణ, శిల్ప కళకు పట్టుగొమ్మగా నిలిచే ఆలయాలు దేశంలో ఎన్నో వున్నాయి.అలాంటి వాటిలో ఒకటి కోణార్క్ సూర్య దేవాలయం.
( Konark Sun Temple ) ఒడిషాలోని పూరీకి సమీపంలో చంద్రభాగ నది ఒడ్డున 12వ శతాబ్ధంలో దీనిని నిర్మించారు.ఆలయ కాంప్లెక్స్‌లోని ఆదిత్యుని విగ్రహంపై సూర్య కిరణాలు పడే విధంగా దీనిని నిర్మించారు.
ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు.దీనికి 24 చక్రాలు వుండి.7 గుర్రాలు లాగుతున్నట్లుగా వుంటుంది.ప్రతి రోజు దేశ విదేశాల నుంచి వేలాది మంది సందర్శకులు కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారు.
తాజాగా ఈ ప్రతిష్టాత్మక ఆలయ నమూనాను అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో( New York Times Square ) ప్రదర్శనకు వుంచారు.భారతీయ కళాకారులు రూపొందించిన ఈ నమూనా ఆగస్ట్ 22 వరకు అందుబాటులో వుంటుంది.
భారత సంతతికి చెందిన చెఫ్ వికాస్ ఖన్నా( Chef Vikas Khanna ) మంగళవారం ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు.ఇదే సమయంలో అక్కడ భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు హాజరయ్యారు.
దీనికి సంబంధించిన వివరాలను వికాస్ ఖన్నా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ ప్రదర్శనను తిలకించాలని కోరారు.వచ్చే ఏడాది న్యూయార్క్‌లోని( New York ) తన రెస్టారెంట్ వద్ద ఈ నమూనాను వుంచుతానని వికాస్ ఖన్నా చెప్పారు.ఇసుకరాయితో తయారు చేయబడిన ఈ నమూనా బరువు 1,750 కేజీల పైనే .ఈ కళాఖండాన్ని భారతీయ కళాకారుడు అమరేష్ చంద్ర బింధాని,( Amaresh Chandra Bindhani ) అతని బృందం తయారు చేసింది.ఒడిశాలోని లలితాగిత్రి గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు కూడా దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్( Ranadhir Jiaswal ) మాట్లాడుతూ.ప్రవాస భారతీయులు, అమెరికన్ల మధ్య ఐక్యతకు చిహ్నంగా దీనిని పేర్కొన్నారు.ప్రపంచం ఒక్కటే అనే భారతదేశ సందేశం విశ్వ వ్యాప్తమవతుందన్నారు.ఈ కార్యక్రమంలో సంతూర్ విధ్వాంసుడు అమ్జద్ అలీఖాన్ కూడా పాల్గొన్నారు.