అమెరికా: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో కోణార్క్ సూర్య దేవాలయ నమూనా.. అమెరికన్లు ఫిదా
TeluguStop.com

భారతీయుల వాస్తు, నిర్మాణ, శిల్ప కళకు పట్టుగొమ్మగా నిలిచే ఆలయాలు దేశంలో ఎన్నో వున్నాయి.


అలాంటి వాటిలో ఒకటి కోణార్క్ సూర్య దేవాలయం.( Konark Sun Temple ) ఒడిషాలోని పూరీకి సమీపంలో చంద్రభాగ నది ఒడ్డున 12వ శతాబ్ధంలో దీనిని నిర్మించారు.


ఆలయ కాంప్లెక్స్‌లోని ఆదిత్యుని విగ్రహంపై సూర్య కిరణాలు పడే విధంగా దీనిని నిర్మించారు.
ఈ ఆలయాన్ని సూర్య భగవానుడి రథం ఆకారంలో నిర్మించారు.దీనికి 24 చక్రాలు వుండి.
7 గుర్రాలు లాగుతున్నట్లుగా వుంటుంది.ప్రతి రోజు దేశ విదేశాల నుంచి వేలాది మంది సందర్శకులు కోణార్క్ సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారు.
తాజాగా ఈ ప్రతిష్టాత్మక ఆలయ నమూనాను అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో( New York Times Square ) ప్రదర్శనకు వుంచారు.
భారతీయ కళాకారులు రూపొందించిన ఈ నమూనా ఆగస్ట్ 22 వరకు అందుబాటులో వుంటుంది.
భారత సంతతికి చెందిన చెఫ్ వికాస్ ఖన్నా( Chef Vikas Khanna ) మంగళవారం ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు.
ఇదే సమయంలో అక్కడ భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులు హాజరయ్యారు.
"""/" /
దీనికి సంబంధించిన వివరాలను వికాస్ ఖన్నా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఈ ప్రదర్శనను తిలకించాలని కోరారు.
వచ్చే ఏడాది న్యూయార్క్‌లోని( New York ) తన రెస్టారెంట్ వద్ద ఈ నమూనాను వుంచుతానని వికాస్ ఖన్నా చెప్పారు.
ఇసుకరాయితో తయారు చేయబడిన ఈ నమూనా బరువు 1,750 కేజీల పైనే .
ఈ కళాఖండాన్ని భారతీయ కళాకారుడు అమరేష్ చంద్ర బింధాని,( Amaresh Chandra Bindhani ) అతని బృందం తయారు చేసింది.
ఒడిశాలోని లలితాగిత్రి గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు కూడా దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు.
"""/" /
ఈ కార్యక్రమానికి హాజరైన న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్( Ranadhir Jiaswal ) మాట్లాడుతూ.
ప్రవాస భారతీయులు, అమెరికన్ల మధ్య ఐక్యతకు చిహ్నంగా దీనిని పేర్కొన్నారు.ప్రపంచం ఒక్కటే అనే భారతదేశ సందేశం విశ్వ వ్యాప్తమవతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సంతూర్ విధ్వాంసుడు అమ్జద్ అలీఖాన్ కూడా పాల్గొన్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, శుక్రవారం 2025