బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా పేరుగాంచి, కాపు సామాజిక వర్గం ఆరాధ్య దైవంగా భావించే దివంగత నేత వంగబెట్టి రంగా తనయుడు వంగవీటి రాధా( Vangaveeti Radha ) జనసేనలో చేరితే చూడాలని చాలామంది కాపు యువకులు, జనసేన సానుభూతిపరులు ఆశపడ్డారు.అయితే ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు .
జనసేన నేతలతో సన్నిహితంగా కనిపించినప్పటికీ అధికారికంగా జనసేనలో వంగవీటి తనయుడు జాయిన్ అవ్వలేదు.అయితే ఇప్పుడు మారుతున్న పరిస్థితులు మరోసారి వంగవీటి కుటుంబాన్ని జనసేనకు దగ్గర చేస్తున్నట్లుగా కనిపిస్తుంది.
త్వరలో రాదాకృష్ణ పెళ్లి పీటలు ఎక్కనున్నారు .నరసాపురానికి చెందిన రాజకీయ నేత జక్కంపూడి బాబ్జి( Political Leader Jakkampudi Bobji ) ద్వితీయ కుమార్తె పుష్పవల్లి వివాహం చేసుకోనున్నట్లుగా తెలుస్తుంది .

జక్కంపూడి ఒకప్పుడు టిడిపి( TDP )లో యాక్టివ్ గా ఉండేవారు అయితే వ్యాపార అవసరాల నిమిత్తం హైదరాబాదులో సెటిల్ అయినా ఈ కుటుంబం ఇటీవల మళ్ళీ నరసాపురానికి తిరిగి వచ్చి జనసేనలో యాక్టివ్ గా పనిచేస్తుంది.వారహి యాత్రలో భాగంగా నరసాపురంలో బస చేసిన పవన్( Pawan Kalyan ) కి వీరి ఇంటిలోనే ఆతిధ్యం ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.వీరి కుటుంబానికి గత 30 సంవత్సరాలుగా రాజకీయ నేపథ్యం ఉన్నట్లుగా తెలుస్తుంది.నరసాపురం మున్సిపల్ చైర్మన్ గా కూడా జక్కంపూడి బాబ్జి భార్య పని చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
దీనిని బట్టి జనసేన కు మద్దత్తు ఇస్తున్న కుటుంబానికి అల్లుడుగా వెళుతున్న వంగవీటి రాధ మరికొన్ని రోజుల్లో జనసేనలో అధికారికంగా చేరే అవకాశం ఉందని కూడా లీకులు వస్తున్నాయి.

జనసేన( Janasena )లో చేరడానికి రాదా కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ అలాంటి పవర్ ఫుల్ లీడర్ ను వదులుకోవడానికి తెలుగుదేశం సిద్ధంగా లేకపోవడం వల్ల చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.టిడిపి తో జనసేనకు పొత్తు చర్చలుఒక కొలిక్కి వస్తే ఈ విషయం కూడా తేలిపోతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.త్వరలోనే శుభ వార్త వినమంటూ జనసేన హార్డ్ కోర్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుండడం గమనార్హం
.







