హైదరాబాద్ లోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ లో లైంగిక వేధింపుల కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఓఎస్డీ హరికృష్ణపై లైంగిక వేధింపులు ఆరోపణలు రావడంతో స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.
మూడు రోజులపాటు ఈ వ్యవహారంపై విచారణ జరిపిన చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు, షీ టీమ్స్ తో పాటు ఉమెన్ ప్రొటెక్షన్ అధికారులు విద్యార్థుల స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు.ఈ క్రమంలోనే హరికృష్ణకు సంబంధించిన అన్ని వివరాలను తీసుకున్నారు.
దీనిపై ఇవాళ మరోసారి కోచ్ లు, అధ్యాపకులు, వర్కర్స్ స్టేట్ మెంట్ నమోదు చేయనున్నారు.అయితే ఈ కేసులో ఇప్పటికే హరికృష్ణను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.







