తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఇద్దరూ మంచి రాజకీయ మిత్రులు అన్న సంగతి అందరికీ తెలిసిందే.అన్ని విషయాలలోను ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల తరువాత ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి .వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలను గెలిపించుకోవడం ఇటు సీఎం కేసీఆర్, అటు ఏపీ సీఎం జగన్ కు ప్రతిష్టాత్మకంగా మారింది.వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన పోటీ ఉన్నా , వాటిని అధిగమించి గట్టెక్కలన్న వ్యూహంతోనే అటు కెసిఆర్ ఇటు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇక ప్రతిపక్షాలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
అయితే సహజంగా అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది.అన్ని వర్గాలను సంతృప్తి పరచడం ఏ ప్రభుత్వానికి సాధ్యపడదు .ఈ విషయాన్ని అటు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరు అర్థం చేసుకున్నారు .అందుకే అన్ని వర్గాల ప్రజల్లోనూ తమపై వ్యతిరేకత లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం, వీఆర్వోలను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం, మైనారిటీ కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించడం వంటి నిర్ణయాల ద్వారా ఆయా వర్గాలను ఆకట్టుకునే విధంగా కేసీఆర్( CM kcr ) వ్యూహం పన్నారు.

తమ ప్రభుత్వం విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించి వారందరినీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు .అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సి కమిషన్ ను కూడా త్వరలోనే నియమించనున్నారు .ఈలోపుగా మధ్యంతర భృతి ప్రకటించి ఉద్యోగుల మద్దతు పొందే విధంగా కేసీఆర్ ప్రయత్నాలు చేయబోతున్నారు.ఇక జగన్ సైతం ఇదే విధంగా ఆలోచించే ఇప్పటికే కేసీఆర్ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలలో చాలా వాటిని అమలు చేశారు.విశాఖను పాలన రాజధానిగా మార్చాలన్నా, టిడిపిని బలహీనం చేయాలన్నా, తన సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక ఓటు బ్యాంకును ఏర్పాటు చేయాలన్నా, మరో ఐదేళ్లపాటు వైసీపీనే అధికారంలో ఉండాలనేది జగన్( CM jagan ) ఉద్దేశం.
అందుకే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు, కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించి మరోసారి వైసీపీకి( YCP party ) తిరుగులేకుండా చేసుకునేందుకు జగన్ ప్రయత్నించే అవకాశం కనిపిస్తుంది.ఇక 2022లో ప్రకటించిన పిఆర్సి పై ప్రభుత్వం మభ్యంతర భృతి ప్రకటించాలని జగన్ నిర్ణయించుకున్నారు.
అలాగే పట్టణాల్లో ఉన్న ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు తక్కువ రేటుకి అందించి వారు మద్దతు సంపాదించాలని నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వ పథకాలు అందని వారంతా జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.అభివృద్ధి జరగడం లేదని విమర్శలు చేస్తున్నారు.అందుకే ఇటీవల విశాఖలో పారిశ్రామిక సదస్సును ఏర్పాటు చేసి పెట్టుబడులను ఆకర్షించే విధంగా జగన్ ప్రయత్నించారు.
ఎన్నికల సమయం నాటికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగానే జగన్ సైతం ఒకే విధమైన నిర్ణయాలు తీసుకుని వచ్చే ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు.







