ఈ న్యాచురల్ టోనర్ ను వాడితే మీ ముఖంపై ఒక చిన్న మొటిమ కూడా ఉండదు.. గ్యారంటీ!

మొటిమలతో బాగా ఇబ్బంది పడుతున్నారా.? వాటి నుంచి విముక్తి పొందడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? పాత మొటిమలు పోయిన మళ్లీ కొత్తవి వస్తూనే ఉన్నాయా.? అయితే అస్సలు చింతించకండి.మొటిమలు ఏర్పడడానికి కారణాలు అనేకం.అలాగే వాటికి చెక్ పెట్టడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టోనర్ ను కనుక వాడితే మీ ముఖం పై ఒక చిన్న మొటిమ కూడా ఉండదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ న్యాచురల్ టోన‌ర్‌ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో ఒక కప్పు ఫ్రెష్ వేపాకు వేసుకోవాలి.అలాగే రెండు అంగుళాల దాల్చిన చెక్క( Cinnamon )ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

 Natural Toner For Acne Free Skin! Acne Free Skin, Natural Toner, Homemade Toner,-TeluguStop.com
Telugu Acne Skin, Tips, Clear Skin, Face, Skin, Homemade, Latest, Natural, Skin

ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ), హాఫ్ టేబుల్ స్పూన్‌ వైల్డ్ టర్మరిక్ పౌడర్ మరియు రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్( Rose water ) వేసి బాగా మిక్స్ చేయాలి.అంతే మన టోనర్ సిద్ధం అవుతుంది.ఒక బాటిల్ లో ఈ టోనర్ ను నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ హోమ్ మేడ్ టోనర్ ను దూది సహాయంతో ముఖానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని పడుకోవాలి.

Telugu Acne Skin, Tips, Clear Skin, Face, Skin, Homemade, Latest, Natural, Skin

ప్రతిరోజు నైట్ ఈ న్యాచురల్ టోనర్ ను కనుక వాడితే మొటిమలు క్రమంగా మాయమవుతాయి.అలాగే ఈ టోనర్ చర్మం పై ఆయిల్ ను కంట్రోల్ చేస్తుంది.తద్వారా కొత్త మొటిమలు రాకుండా ఉంటాయి.పైగా ఈ టోనర్ ను రెగ్యులర్ గా వాడితే మొటిమలు తాలూకు మచ్చలు మాయమవుతాయి.పిగ్మెంటేషన్ సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది.కాబట్టి మొటిమలు లేని ముఖ చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ టోనర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube