భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం ( 77th Independence Day )సందర్భంగా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆధ్యాత్మిక బోధకులు మొరారీ బాపు ‘రామ్ కథ( Ram Katha )’ అనే హిందూ మతపరమైన ఉపన్యాసం చేశారు.ఈ కార్యక్రమానికి బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ హాజరయ్యారు.
ఆ తర్వాత ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తన విశ్వాసం చాలా వ్యక్తిగతమైనదని, తన జీవితంలోని అన్ని అంశాలలో మార్గదర్శక శక్తిగా పనిచేసిందని ఈ యూకే ప్రధాన మంత్రి అన్నారు.యూకే ప్రైమ్ మినిస్టర్ పదవిని అధిరోహించిన తొలి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా రిషి సునక్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

సునక్( Rishi Sunak ) ఈ కార్యక్రమంలో వేదికపై హనుమంతుని చిత్రపటాన్ని కలిగి ఉన్న బ్యాక్‌డ్రాప్ కూడా చూపారు.10 డౌనింగ్ స్ట్రీట్‌లో తన డెస్క్‌పై గోల్డెన్ గణేశ విగ్రహాన్ని కలిగి ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు.సునక్ బ్రిటిష్, హిందువుగా తన గర్వాన్ని నొక్కి చెప్పారు.అతను సౌత్ హాంప్టన్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలను కూడా నెమరువేసుకున్నారు.అక్కడ అతను తన తోబుట్టువులతో కలిసి స్థానిక ఆలయాన్ని తరచుగా సందర్శించినట్లు తెలిపారు.

చివరిగా మాట్లాడుతూ భగవంతుడు తనకు ఎల్లప్పుడు స్పూర్తిదాయకంగా ఉంటాడని అతను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని, వినయంతో పరిపాలించాలని, నిస్వార్థంగా పనిచేయాలని శ్రీరాముడు బోధిస్తున్నాడని అన్నారు.వేదికపై జరిగిన ఆరతి కార్యక్రమంలో సునక్ చురుకుగా పాల్గొన్నారు.
జ్యోతిర్లింగ రామ్ కథా యాత్ర నుంచి పవిత్ర నైవేద్యంగా సోమనాథ్ ఆలయం నుంచి ప్రతిష్టించిన శివలింగాన్ని సునక్‌కు మొరారి బాపు సమర్పించారు.







