బీట్ రూట్ ( Beet root )లో ఎన్నో అద్భుత ఔషధాలు దాగి ఉన్నాయి.ముఖ్యంగా రక్తహీనత ( anemia )ఉండే వారికి ఈ బీట్ రూట్ ఒక మంచి ఔషధం ఉపయోగపడుతుంది.
కాబట్టి మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతులు ఈ పంటను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.సేంద్రీయ విధానంలో సాగు చేస్తే మంచి లాభాలను పొందవచ్చు.
ఈ పంట సాగుకు సారవంతమైన ఇసుక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.చల్లటి వాతావరణం ఉంటే అధిక దిగుబడి సాధించవచ్చు.నేల యొక్క ఉదజని సూచిక 6-7 మధ్యన ఉండాలి.అధిక క్షార స్వభావం కలిగిన చౌడు నెలలలో కూడా ఈ పంటను సాగు చేయవచ్చు.
ఈ పంటకు ఉష్ణోగ్రత 18-25 డిగ్రీల మధ్య ఉంటే అధిక దిగుబడి సాధించవచ్చు.

కొత్తగా ఈ బీట్ రూట్ పంటను సాగు చేయాలి అనుకునేవారు పాటించవలసిన జాగ్రత్తలు, ఎరువుల యజమాన్యం లకు సంబంధించిన వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం.
వేసవికాలంలో నేలను బాగా లోతు దుక్కులు దున్నుకొని అదునుగా వచ్చేటట్లు నేలను తయారు చేయాలి.ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు పది టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి.
వీటితో పాటు 40 కిలోల భాస్వరం( Phosphorus ) 15 కిలోల నత్రజని, 15 కిలోల పొటాష్ ఎరువులు వేసుకోవాలి.ఇక ఒక ఎకరాకు సుమారుగా నాలుగు కిలోల విత్తనాలు అవసరం.
వివిధ రకాల తెగుళ్లు సోగకుండా విత్తనాలకు విత్తన శుద్ధి చేసుకోవాలి.

మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 40 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఒకే చోట ఎక్కువ మొక్కలు ఉంటే వాటిని తొలగించి వేరేచోట విత్తుకోవాలి.బీట్రూట్ విత్తిన 25 రోజుల తర్వాత పొలంలో కలుపును తీయాలి.
మళ్లీ ఒక ఎకరం పొలంలో 15 కిలోల పోటాష్ 15 కిలోల నత్రజని ఎరువులను చల్లుకోవాలి.
బీట్రూట్ మొక్క చుట్టూ మట్టి తిరిగేస్తే గడ్డ పెద్దగా ఊరడానికి అవకాశం ఉంటుంది.
బీట్రూట్ సాగు చేసిన 100 రోజుల లోపు పంట చేతికి వస్తుంది.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 10 టన్నులకు పైగానే దిగుబడి పొందవచ్చు.







