సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్లకు సక్సెస్ రేట్ కూడా ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే.ఒకప్పుడు గోల్డెన్ లెగ్ గా పాపులర్ అయిన పూజా హెగ్డే,( Pooja Hegde ) కృతి శెట్టి( Kriti Shetty ) ప్రస్తుతం ఐరన్ లెగ్ గా మారిపోయారు.
కాజల్, అనుష్క, సమంత, శ్రీలీల మరి కొందరు హీరోయిన్లు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం వల్లే ఇప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.రకుల్, తాప్సీ, కేతిక శర్మ లాంటి మరి కొందరు హీరోయిన్లు సరైన సక్సెస్ రేట్ లేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.
అయితే కెరీర్ లో నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అయినా స్టార్ స్టేటస్ తో కెరీర్ ను కొనసాగిస్తున్న హీరోయిన్లలో తమన్నా( Tamanna ) ఒకరు.తమన్నా నటించిన జైలర్, ( Jailer ) భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కాగా జైలర్ సినిమాలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో ఆమె నటించారు.
రజనీకి జోడీగా తమన్నా నటించారని భావించిన అభిమానులు జైలర్ సినిమాలో తమన్నా రోల్ ను చూసి షాకయ్యారు.

భోళా శంకర్ సినిమాలో తమన్నా రోల్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.చిరంజీవికే( Chiranjeevi ) కాదు చాలామంది టాలీవుడ్ స్టార్స్ కు ఆమె షాకిచ్చారు.హ్యాపీడేస్, రచ్చ, 100% లవ్, బాహుబలి, బెంగాల్ టైగర్, ఊపిరి సినిమాలతో సక్సెస్ లను సొంతం చేసుకున్న తమన్నా బద్రీనాథ్,( Badrinath Movie ) ఊసరవెల్లి,( Ooseravelli Movie ) రెబల్,( Rebel ) ఆగడు, కెమెరామేన్ గంగతో రాంబాబు, సైరా, సీటీమార్, నా నువ్వే, మ్యాస్ట్రో, ఎందుకంటే ప్రేమంత మరికొన్ని సినిమాలతో ఫ్లాప్ లను ఖాతాలో వేసుకున్నారు.

శ్రీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్నా కెరీర్ మొదలుకాగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు.ప్రస్తుతం పెద్దగా గుర్తింపు లేని రోల్స్ కు సైతం తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.







