ఏపీలో త్వరలోనే ప్రజాకోర్టు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.తప్పు చేసే వారికి ప్రజాకోర్టులో ఏయే చట్టాల కింద శిక్ష పడాలని ప్రశ్నించారు.
రాజ్యాంగం ఉల్లంఘన ఎలా జరుగుతుందనే దానిపై కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జనసేనాని తెలిపారు.తప్పు జరిగినప్పుడు ప్రతి ఘటించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే తప్పును ప్రతిఘటించాలని తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలన్నారు.మహిళలపై దాడులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అధికారంలోకి వస్తే మహిళలు, పిల్లలకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.







