ఘనంగా జండా వందనం వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎల్లారెడ్డిపేట మండలంలో ఘనంగా జరిగాయి.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం మొదటగా స్థానిక గాంధీ విగ్రహం వద్ద వనం బొందయ్య, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, పోస్ట్ ఆఫీస్ ముందు మాలోతు రాజు, తహసిల్దార్ కార్యాలయం ముందు తాసిల్దార్ జయంత్ కుమార్, ఎంపీడీవో కార్యాలయం ముందు ఎంపీపీ పిల్లి రేణుక, పోలీస్ స్టేషన్లో సీఐ శశిధర్ రెడ్డి, జెడ్పిటిసి కార్యాలయం ముందు జెడ్పిటిసి సమక్షంలో ఉద్యమకారుడు అందే సుభాష్, వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సెస్ కార్యాలయం ముందు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, అంబేద్కర్ విగ్రహం ముందు సంఘం అధ్యక్షులు, నెహ్రూ విగ్రహం ముందు బండారి బాల్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట టౌన్ కాంగ్రెస్ గద్దె ముందు వంగ గిరిధర్ రెడ్డి,

 Independance Day Grandly Celebrated At Ellareddy Peta Mandal, Independance Day ,-TeluguStop.com

మండల రెడ్డి సంక్షేమ సంఘం ముందు గుండాడి వెంకట్ రెడ్డి, వైశ్య సంఘం ముందు బొమ్మ కంటి రవి గుప్తా, రైతు చర్చ సంఘం ముందు సందుపట్ల రాజిరెడ్డి, నేవూరి మాలిస్ పటేండ్ల సంఘం ముందు అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి,మండల మున్నూరు కాపు పటేల్స్ సంఘం ముందు నంది కిషన్, ఇందిరమ్మ కాలనీలో కాలనీ చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్, ఎల్లారెడ్డిపేట మున్నూరు కాపు సంఘం పటేల్స్ ముందు బాధ రమేష్, మండల గౌడ సంక్షేమ సంఘం ముందు గంట కార్తీక్ గౌడ్, హరిజనవాడలోని అంబేద్కర్ సంఘం భవనం ముందు కర్రోళ్ల ఎల్లయ్య, ఎల్లారెడ్డిపేట గౌడ సంక్షేమ సంఘం ముందు గంట శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల ముందు ఆయా ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాలను ఎగురవేశారు.

అనంతరం జాతీయ గీతాన్ని ఆలకించారు.మిఠాయి తినిపించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube