రాజన్న సిరిసిల్ల జిల్లా ఏఆర్ హెడ్ క్వార్టర్,జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో 77 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ గౌరవ వందనం స్వీకరించి అనంతరం జెండా ఆవిష్కరణ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్( SP Akhil Mahajan ).ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
జిల్లా ప్రజలకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి పోలీస్ కుటుంబం సభ్యులకు 77 వ స్వాతంత్ర్య దినోత్సవ ( Independence Day )శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశం మొత్తం ఈరోజు ఆనందంగా జరుపుకుంటున్న స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, మనం ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వడానికి ఎందరో మహానుభావులు కష్ట, నష్టాలకు ఓర్చి వారి విలువైన జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను స్మరిస్తూ, ఎంతో మంది త్యాగధనుల పుణ్యఫలం, లెక్కలేనని త్యాగాలు అవిశ్రాంత పోరాటాల తర్వాత వలస పాలన విముక్తి తరువాత స్వాతంత్రం సిద్ధించిందని స్వాతంత్రోద్యమం చరిత్ర, మనకు తెలిసిన మహనీయులు కాకుండా ఎంతోమంది ప్రాణ త్యాగం చేయడం జరిగింది.
వారి గురించి కూడా పిల్లలకు, కుటుంబం సభ్యులకు భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు.
ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ మన వంతు భాద్యతగా దేశసేవ కొరకు పాటుపడాలని, సిబ్బంది తమ విధులను భాద్యతాయుతంగా నిర్వహించి పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.
పోలీస్ అధికారులు సిబ్బంది వారివారి విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని, ముందు ముందు విషయ పరిజ్ఞానం మరింత పెంచుకోని నీతి నిజాయితీగా సేవలు అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు ఉదేయ్ రెడ్డి, నాగేంద్రచరి, రవికుమార్ సి.ఐ లు ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు
.