ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ( Vivek Agnihitri ).ఈ సినిమా ద్వారా దర్శకుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఈ సినిమా కారణంగా ఈయన పలు వివాదాలలో కూడా చిక్కుకున్నారు.
ఇక ఈ సినిమా అనంతరం వివేక్ అగ్నిహోత్రి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.ఈ సందర్భంగా ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
ఇక పరోక్షంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ని కూడా ఈయన టార్గెట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

రాత్రంతా ఫుల్లుగా తాగి పొద్దున్నే దేవుడు వేషం వేసుకుంటే తాను దేవుడు అని ఎవరు నమ్మరు అంటూ ప్రభాస్ నటించిన సినిమా గురించి ఈయన విమర్శలు చేశారు అలాగే దికాశ్మీర్ ఫైల్స్ సినిమా ప్రభాస్ రాదే శ్యామ్ సినిమాని చిత్తుచిత్తుగా ఓడించిందని తెలిపారు.ఇక సలార్ సినిమాని కూడా మరొక తన సినిమాతో ఓడిపోయేలా చేస్తాను అంటూ ఈయన తన సన్నిహితుల దగ్గర వెల్లడించినట్లు వార్తలు కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.ఇలా తరుచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచే ఈయన మరోసారి బాలీవుడ్ నటుడు గురించి మాట్లాడుతూ నిలిచారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రణవీర్ సింగ్( Ranveer Singh ) గురించి వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.గతంలో ఈయన న్యూడ్ ఫోటోలు ఎలాంటి వివాదానికి కారణమయ్యాయో మనకు తెలిసిందే.రణబీర్ న్యూడ్ ఫోటోషూట్ లపై ఎంతోమంది విమర్శలు చేశారు.అయితే ఆ సమయంలో వివేక్ అగ్నిహోత్రి మాత్రం మద్దతు తెలిపారు.ఇలా ఈ న్యూడ్ ఫోటోల విషయంలో తనకు మద్దతుగా నిలబడినందుకు ఈయన ఓ అవార్డు వేడుకలలో భాగంగా నా పాదాలకు నమస్కారం చేశారు అంటూ రణవీర్ సింగ్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







