మన కన్నుల ముందరే కాలం పరిణామ క్రమం చాలా మార్పు చెందుతూ వున్నది.ఒకప్పుడు ఒక ఊరిలో ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉంటేనే పెద్ద గొప్ప.
ఇక సెల్ ఫోన్( Mobile Phone ) అంటారా? అది గొప్పింటి వాళ్ళకే సాధ్యపడేది.కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
గడిచిన రెండు దశాబ్దాలలో మనం అనేక మార్పులను చూసాం.ముఖ్యంగా టెక్నాలజీ( Technology ) అనేది మనిషిని ఎన్నో దశాబ్దాల ముందుకు తీసుకుపోతోంది.
ఇపుడు సెల్ ఫోన్ లేని మనిషి ఉండడు అంటే అతిశయోక్తి లేదు.

అయితే, అంతవరకూ బాగానే వుంది.నేడు సెల్ ఫోన్ ఉండడం వలన మనం ఎన్నో రకాలుగా లబ్ది పొందుతూ వున్నాము.అదే సమయంలో మనిషికి సెల్ ఫోన్ కి పూర్తిగా బానిసగా( Mobile Addiction ) మారిపోతున్న భయంకరమైన పరిస్థితిని మనం చూస్తూ వున్నాం.
అవును, ఫోన్ వచ్చిన తరువాత మన పక్కనున్న వారితో మనం మనస్ఫూర్తిగా మాట్లాడడం మానేశాము.అంతెందుకు ఇంట్లో వున్న మనుషులు కూడా మాట్లాడుకోవడం మానేశారు.ఒకప్పుడు గుంపుగా నలుగురు కలిస్తే కబుర్లతో కాలక్షేపం చేసేవారు.కానీ ఇపుడు సెల్ ఫోన్ మత్తులో తులతూగుతున్నారు.
ఇది కూడా ఒక అడిక్షన్… ముందుకి, డ్రగ్స్ కి మనిషి ఎలా అయితే బానిస అవుతున్నాడో ఇది కూడా అదే కోవకు చెందినది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

అందుకే రోజులో ఓ గంట ఫోన్ లేకుండా ట్రై చెయ్యండి.అప్‌గ్రేడ్ అవుతున్న ప్రతి డిజిటల్ ప్రపంచం( Digital World )లో మనం డిజిటల్ జీవితాన్ని గడుపుతున్నాం సరే.దానికంటే ముందు మనం మనుషులం.మనం కనిపెట్టిన టెక్నాలజీ చేతుల్లోకి మనం వెళ్లిపోవడం కాదు, మనం వాటిని కంట్రోల్లో పెట్టుకోవాలి.ఫోన్ చూడకపోతే ఏడ్చే పిల్లలు మన చుట్టు చాలా మంది ఉన్నారు.
అంతెందుకు మన ఇంట్లోనే, మన పిల్లలే ఫోన్ ఇవ్వకపోతే ఏడుస్తారు.ఎమోషన్ గా ఉండాల్సిన పిల్లలు చాలా సున్నితంగా తయారవుతున్నారు.
ఈ టెక్నాలజీ , వర్చువల్ గేమ్స్( Virtual Games ) కారణంగా వైలెంట్ గా తయారవుతున్నారు.ఇవన్నీ తగ్గాలంటే పక్కాగా టెక్నికల్ లైఫ్ తో పాటు పిల్లలకు జనాలతో కలిసి బతికే నేర్పును కూడా నేర్పించాలి, మనం నేర్చుకోవాలి.
దేశం అభివృధ్ధి చెందాలి కాబట్టి టెక్నాలజీ కావాలి… మీ జీవితాలు బాగుపడాలంటే బ్యాలెన్డ్ గా ఉండాలి.అన్నింటికంటే ముఖ్యంగా ఏదీ వ్యసనంగా మారకూడదు.







