శ్రీదేవి( Sridevi ) .అలనాటి అందాల తారగా ఎంతమంది హీరోయిన్లు వస్తున్నా కూడా ఈ హీరోయిన్ క్రేజ్ తగ్గకుండా ఇప్పటికీ ఆమె మరణించిన కూడా సినిమాల రూపంలో ఆమె అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
ఇక నిన్న అనగా ఆగస్టు 13న శ్రీదేవి జయంతి కారణంగా గూగుల్ లో శ్రీదేవి ఫోటోతో ఆమెపై అభిమానాన్ని చాటుకున్నారు.అయితే అలాంటి శ్రీదేవి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని స్టార్ హీరోయిన్ అయింది.
నాలుగేళ్ల వయసు లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పదేళ్లకే వరుస సినిమాలతో గుర్తింపు సాధించింది.అంతేకాదు కేవలం 15 ఏళ్లకే హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసి చక్రం తిప్పింది.

అలాంటి ఈ ముద్దుగుమ్మ ఏ సినిమాలో నటించినా కూడా ఆ సినిమా హిట్ అనే విధంగా ఉండేది.ఇక కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా తన సత్తా ఏంటో నిరూపించుకొని ఇండియా వ్యాప్తంగా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.అలాంటి శ్రీదేవి దుబాయ్ ( Dubai ) కి పెళ్లికని వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.అంతే కాదు ఆమె డెత్ ఇప్పటికి కూడా చాలామందికి మిస్టరీగానే ఉంటుంది.
ఇదంతా పక్కన పెడితే శ్రీదేవి ఆ రెండు కోరికలు తీరకుండానే చనిపోయింది అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి.మరి ఏ కోరికలు తీరకుండా శ్రీదేవి చనిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీదేవి రాఘవేంద్రరావు ( Raghavendra rao ) కాంబినేషన్లో 24 సినిమాలు వచ్చాయట.ఇక ఆ తర్వాత కాలంలో శ్రీదేవి చనిపోయే ముందు రాఘవేంద్రరావు కాంబినేషన్లో తన 25వ సినిమా చేసి తన జీవితంలో ఒక రికార్డు క్రియేట్ చేద్దాం అనుకుందట.

కానీ రాఘవేంద్రరావు దర్శకత్వంలో 25వ సినిమాలో నటించకుండానే మరణించడం బాధాకరం.ఇక మరో కోరిక శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ( Jhanhvi kapoor ) ని ఎలాగైనా సరే పెద్ద స్టార్ హీరోయిన్ ని చేయాలని కలలు కన్నదట.కానీ తన కూతురు సినిమాల్లో హీరోయిన్ కాకముందే మరణించింది.ఇలా ఈ రెండు కోరికలు తీరకుండానే శ్రీదేవి మరణించింది అని ఆమె అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు.








