కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు.ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమా ను( Salaar ) రెండు ఛాప్టర్ లుగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.
ప్రశాంత్ నీల్ మరోసారి వెయ్యి కోట్ల మార్క్ ను క్రాస్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.సలార్ 1 తో ప్రభాస్( Prabhas ) వెయ్యి కోట్ల వసూళ్లను నమోదు చేస్తాడా అనేది ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న.
హీరో ఎవరు అయినా కూడా ప్రశాంత్ నీల్ భారీ వసూళ్లు నమోదు చేయడం ఖాయం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అందులో భాగంగానే ప్రశాంత్ నీల్ సలార్ తో భారీ వసూళ్లు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ చాలా మంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.సలార్ రెండు భాగాల తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమా ఏంటి అంటే ఠక్కున వినిపించే సమాధానం ఎన్టీఆర్( NTR ) సినిమా.మొన్నటి వరకు ఇది నిజమే.
కానీ ఇప్పుడు కాదు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ తర్వాత ప్రభాస్ చేయబోతున్న సినిమా కేజీఎఫ్ 3.( KGF 3 ) ఔను తాజాగా కేజీఎఫ్ 2 సినిమా వార్షికోత్సవం సందర్భంగా నిర్మాణ సంస్థ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది.

ఇప్పటి వరకు కేజీఎఫ్ రెండు భాగాలుగా వచ్చింది.ఇప్పుడు కేజీఎఫ్ ను మూడవ భాగంతో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకోసం సలార్ 2 విడుదల కాకుండానే దర్శకుడు స్క్రిప్ట్ వర్క్ ను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కేజీఎఫ్ 2 సినిమా విడుదలకు ముందు ఎలా అయితే సలార్ సినిమా ప్రారంభం అయిందో సలార్ 2 సినిమా విడుదలకు ముందే కేజీఎఫ్ 3 సినిమా ని మొదలు పెట్టాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు.మరి ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు ఉంటుందో చూడాలి.







