సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ మధ్య కాలంలో రజినీకాంత్ సినిమాల్లో బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా లేదు అనే చెప్పాలి.
అయితే ఈసారి ఈయన సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే బ్లాక్ బస్టర్ ఖాయం అనే అనిపిస్తుంది.నిన్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన మూవీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

రజనీకాంత్ చేసిన ‘‘జైలర్’‘ ( Jailer Movie )సినిమాతో నిన్న ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాపై ముందు నుండి భారీ హైప్ నెలకొంది.ఆ హైప్ కు తగ్గట్టే రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకు పోతుంది.ప్రీమియర్స్ నుండే ఈ సినిమాకు మంచి టాక్ రావడమే కాదు.సూపర్ స్టార్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ తో వచ్చాడు అనే కామెంట్స్ వినిపించాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా మొదటి రోజు రాబట్టిన కలెక్షన్స్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాతో దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు అంచనా.
మొదటి రోజు కలెక్షన్స్ ను గమనిస్తే.

కోలీవుడ్ లో 29.46 కోట్లు, టాలీవుడ్ ( Tollywood )లో 12.04 కోట్లు, కర్ణాటకలో 11.92 కోట్లు రాబట్టినట్టు తెలుస్తుంది.ఇక ఓవర్సీస్ లో అయితే ఏకంగా రజినీకాంత్ మొదటి రోజు 32.75 కోట్లు రాబట్టినట్టు టాక్.మొత్తంగా వరల్డ్ వైడ్ గా 95.78 కోట్లు రాబట్టి సూపర్ స్టార్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు.ఇక సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా ( Tamannaah Bhatia )హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.







