పద్మశాలీ రాజకీయ యుద్ధభేరి పోస్టర్ ఆవిష్కరణ..

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణలో పద్మశాలీలకు జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేందుకు పోరాడక తప్పదని సంఘం రాష్ట్ర సమన్వయకర్త శ్రీనివాస్​ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం లో బుధవారం రోజున ఆగస్టు13 జరిగే ‘చలో కోరుట్ల–రాజకీయ యుద్ధభేరి’ పోస్టర్ ఆవిష్కరించారు.

 Padmashali Rajakeeya Yuddhaberi Poster Launch At Rudrangi Mandal, Padmashali Raj-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ప్రజాస్వామ్యంలో మా హక్కులు, మా వాట సాధించుకోవడానికే కోరుట్లలో లక్ష మంది పద్మశాలియులతో రాజకీయ యుద్ధభేరి నిర్వహించనున్నట్టు తెలిపారు.

దామాషా ప్రకారం పద్మశాలిలకు అసెంబ్లీలో పది స్థానాలు, కౌన్సిల్ లో ఐదు స్థానాలు, పార్లమెంట్లో మూడు స్థానాలు కల్పించాలని రాజకీయ పార్టీలకు కోరారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిదశ ఉద్యమంలోనూ, మలిదశ ఉద్యమంలోనూ పద్మశాలీలు ఎనలేని త్యాగాలు చేశారని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం సమన్వయకర్త రామ శ్రీనివాస్ అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్మశాలి నాయకులు ఉద్యమించి ప్రాణ త్యాగాలు చేసిన చరిత్ర ఉందన్నారు.తెలంగాణ సకలజనుల సమ్మెలో పద్మశాలీలంత మగ్గాలు, రాట్నాలను రోడ్లపై ప్రదర్శించి ఉద్యమించారని చెప్పారు.

వేలాది మంది పద్మశాలియులతో గర్జనలు నిర్వహించామని, అయితే.రాష్ట్రంలో రాజకీయంగా నష్టపోయింది మాత్రం పద్మశాలి కులమని అన్నారు.

కోరుట్లలో జరిగే పద్మశాలి రాజకీయ యుద్ధభేరికి పల్లె పల్లె నుండి ఎవరికి వారే సైనికుల వలె తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.నేతన్నల బతుకు చిత్రం మార్చుకునేందుకు రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రుద్ర శ్రీనివాస్, బోగా వెంకటేశ్వర్లు ,ఆనందం,శివ భక్త మార్కండేయ సంఘం అధ్యక్షులు పులి రాజేష్, కార్యదర్శి ఎలిగేటి ప్రదీప్ ,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు పిల్లామరపు ప్రవీణ్ ,పులి లక్ష్మీరాజం, కొండ సత్యనారాయణ, బింగి గణేష్ , మంచే రాజేశం, పడాల శంకరయ్య, పడాల గణేష్ , మంచే నారాయణ , మంచే కృష్ణ హరి, మంచే శ్రీనివాస్ , బాసన్ దయానందం ,ఎలిగేటి కిరణ్,దాస నరేష్ , గాజుల వేణు,మంచి సత్యానందం, నడిగట్ల గణేష్, కుల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube