పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన బీఆర్ఎస్ ( BRS )అధినేత , తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఉండాలంటే, ముందుగా తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించాలని , అప్పుడే జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపించవచ్చని నమ్ముతున్నారు.
అందుకే తెలంగాణ ఎన్నికలపై ( telangana elections )ఈ స్థాయిలో దృష్టి సాధించారు.బిజెపి, కాంగ్రెస్ లకు ధీటుగా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో జాప్యం చేసామని, ఈ విషయంలో విమర్శలు పాలు కాకుండా ఉండేందుకు ఆ హామీలను ఇప్పుడే అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. రైతులకు లక్ష రుణమాఫీ , ఉద్యోగులకు పిఆర్సి తో పాటు, ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం లో కలిపేందుకు నిర్ణయం తీసుకున్నారు.లక్ష సాయంతో బీసీ మైనారిటీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.అలాగే నిరుద్యోగులను తమ వైపుకు తిప్పుకునేందుకు అన్ని ప్లాన్ లు వేస్తున్నారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కొంతమంది ఎమ్మెల్యే లు ,నిరుద్యోగ భృతి విషయంపై కేసీఆర్ ( kcr )ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం పై నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారని, నిరుద్యోగ భృతి ఇవ్వడం వల్ల వారికి దగ్గర అవుతామని , ప్రతిపక్షాలకు సైతం చెక్ పెట్టవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.

నిరుద్యోగులను పట్టించుకోకపోతే కుటుంబ సభ్యులతో కలిసి వారు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు సూచించడం తో, కేసీఆర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారట. 2018 ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి అస్త్రాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చారు.దీని ప్రకారం ప్రతి నెల ఒక్కో నిరుద్యోగికి రూ.3016 ఇస్తున్నట్లుగా ప్రకటించింది.ఇదే విధంగా పాత హామీలు ఒక్కొక్కటీ బయటకి తీస్తూ ఏ విషయంలోనూ జనాల్లో వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది.







