భారత్ ను గెలిపించిన సూర్య కుమార్ యాదవ్ ఖాతాలో సరికొత్త రికార్డు..!

భారత్- వెస్టిండీస్( West Indies ) మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.భారత జట్టు బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ బౌండరీలతో చెలరేగి విధ్వంసక ఇన్నింగ్స్ నమోదు చేయడంతో భారత్ విజయం సాధించింది.

 A New Record In The Account Of Surya Kumar Yadav..! , Surya Kumar Yadav, Shubman-TeluguStop.com

సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్ కొనసాగించి కొన్ని రికార్డులు సాధించాడు అవి ఏమిటో చూద్దాం.అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100కు పైగా సిక్సర్లు బారిన మూడో ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన కీరన్ పోలార్డ్, కేఎల్ రాహుల్ లను వెనుకకు నెట్టేశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో యశస్వి జైస్వాల్, శుబ్ మన్ గిల్ ( Shubman Gill )ఆరంభంలోనే విఫలమయ్యారు.మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 44 బంతుల్లో 10 ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 83 పరుగులు చేశాడు.
ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లకు లక్ష్య చేదన సులభం అవడంతో 17.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి భారత్ విజయం సాధించింది.

అంతర్జాతీయ టీ20 లో భారత్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో రోహిత్ శర్మ 1082 సిక్స్ లతో అగ్రస్థానంలో ఉన్నాడు.విరాట్ కోహ్లీ( Virat kohli ) 117 సిక్స్ లతో రెండవ స్థానంలో ఉన్నాడు.తాజాగా సూర్య కుమార్ యాదవ్ 101 సిక్స్ లతో మూడవ స్థానానికి చేరాడు.

దీంతో కైరన్ పొలార్డ్ 101 టీ20 అంతర్జాతీయ మ్యాచులలో 99 సిక్సర్లు కొట్టాడు.కేఎల్ రాహుల్ 72 టీ20 అంతర్జాతీయ మ్యాచులలో 68 ఇన్నింగ్స్ లలో 99 సిక్సర్లు కొట్టాడు.

సూర్య కుమార్ యాదవ్ 101 సిక్సర్లతో ఈ ఇద్దరినీ వెనుకకు నెట్టేశాడు.భారత్ టీ20 టైటిల్ గెలవాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచ్లలో కూడా విజయం సాధించాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube