టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఫ్యామిలీలకు ఎంతలా గౌరవం ఉందో చూస్తూనే ఉన్నాం.అందులో ఒకరు అక్కినేని ఫ్యామిలీ అని చెప్పాలి.
గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీ అంటే చాలా గౌరవం చూపించే వాళ్ళు జనాలు.ఇప్పటికీ కూడా అంతే అభిమానం చూపిస్తున్నారు కానీ వ్యక్తిగత జీవితాల పట్ల ఈ ఫ్యామిలీ పై బాగా విమర్శలు ఎదురయ్యాయి.
అందరికీ తెలిసిందే నాగార్జున( Nagarjuna ) వారసులు నాగచైతన్య( Naga Chaitanya ) అఖిల్ ఇద్దరు తమ జీవితంలోకి వచ్చిన అమ్మాయిలను వదులుకున్నారు.చైతన్య పెళ్లి తర్వాత మూడు సంవత్సరాల విడిపోతే.
అఖిల్ మాత్రం ఎంగేజ్మెంట్ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నాడు.అలా వీళ్ళ వ్యక్తిగత పట్ల ఆమధ్య బాగా ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి.
అంతేకాకుండా వీరిద్దరికీ కెరీర్ పరంగా సక్సెస్ అనేది లేకపోయింది.

ప్రస్తుతం తమ తండ్రి, తాత దక్కించుకున్న స్టార్ హోదా కోసం బాగా ఆరాటపడుతున్నారు.కానీ ఆ హోదాకి మాత్రం చేరుకోలేకపోతున్నారు.వరుసగా సినిమాలలో అవకాశాలు అందుకున్నప్పటికీ కూడా అవి సరైన సక్సెస్ అందివలేక పోతున్నాయి.
ఇక అక్కినేని అఖిల్( Akhil ) హీరోగా నటించిన ఏ సినిమా కూడా సక్సెస్ కాలేకపోయాయి.రీసెంట్గా వచ్చిన ఏజెంట్ సినిమా( Agent movie ) కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

ఇక నాగచైతన్య అవకాశాలు అందుకుంటున్నప్పటికీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.ఇక వారి తండ్రి నాగార్జునకు కూడా ఈమధ్య అస్సలు కలిసి రావడం లేదు.అయితే నాగార్జున విషయం పక్కకు పెడితే ఆయన ఇద్దరు కొడుకులు సినిమా కథను ఎంచుకునే విషయంలో బాగా పొరపాటు చేస్తున్నారు.అందుకే వారికి సరైన హిట్ రావట్లేదు.
ఈ నేపథ్యంలో కొడుకులకు మంచి హిట్ అందివ్వటం కోసం నాగార్జున వారి జీవితంలోకి కొత్త వ్యక్తిని తీసుకురావడానికి నిర్ణయించుకున్నట్టు తెలిసింది.వారి భవిష్యత్తును చక్కదిద్ది మంచి దారిలో నడిపించడం కోసం కొడుకుల సినిమాల విషయంలో పర్సనల్ అసిస్టెంట్ ను అపాయింట్ చేస్తున్నట్లు తెలిసింది.
తమ సినిమాల విషయంగా తము ఎంచుకునే కథలలో పొరపాటు చేస్తున్నారని ఇప్పటికి చాలామంది ప్రేక్షకులు కామెంట్ చేయడంతో నాగార్జున అవ్వన్ని తట్టుకోలేక వారి కోసం సపరేట్ టాలెంటెడ్ మేనేజర్ ని అపాయింట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే నాగచైతన్య తన నటనలో మరింత టాలెంట్ ను పెంచుకోవడం కోసం ఆదిశక్తి థియేటర్లో జాయిన్ అయ్యాడని తెలిసింది.అది కూడా మేనేజర్ సపోర్ట్ తో జరిగిందని తెలుస్తుంది.ఇక అఖిల్ కూడా తన అన్నలాగానే అక్కడికి వెళ్లి జాయిన్ అయి తన నటనను ఇంకా పెంచుకోవడానికి ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసింది.
అయితే ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం అక్కినేని అభిమానులు మాత్రం కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు కనిపిస్తుంది.ఇప్పుడైనా వారి తలరాతలు మారిపోతాయే బాగుండు అని కోరుకుంటున్నారు.
మరీ ఆ మేనేజర్ తీసుకునే నిర్ణయాలు వారికి ఎటువంటి సక్సెస్ అందిస్తాయో చూడాలి.







