కొరటాల శివ ( Koratala Shiva )డైరెక్షన్ లో ఎన్టీయార్ ( NTR )చేస్తున్న రెండోవ సినికందేవర…ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఎన్టీయార్ ఫస్ట్ లుక్ సూపర్ గా ఉంది అంటూ చాలా రకాలైన కామెంట్లు వినిపిస్తున్నాయి నిజానికి ఈ సినిమా లుక్ మీద ఎన్టీయార్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట… జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో ఒక ప్రత్యేకమైన సెట్ లో కొనసాగుతోంది.VFX టీమ్ తో కలిసి దర్శకుడు కొరటాల శివ కొన్ని సముద్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ సన్నివేశంలో ఉండే ఒక యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా హైలెట్ కాబోతుందట.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ షార్క్ మధ్యలో కూడా దర్శకుడు ఒక హై వోల్డేజ్ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.సముద్రంలో ఒక భయంకరమైన షార్క్ ఎదురుపడితే హీరో దాన్ని ఎలా ఎదిరించాడు అనే సింపుల్ పాయింట్ తో కాకుండా దాని వెనుక ఒక బలమైన రీజన్ కూడా దర్శకుడు హైలెట్ చేయబోతున్నట్లు సమాచారం… ముందుగానే ఈ సీన్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా వర్క్ షాప్ కూడా నిర్వహించాడు.ఇక వీలైనంత త్వరగా ఈ సీన్స్ ను ఫినిష్ చేసి మరొక కీలకమైన షెడ్యూల్ ను మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.

ఇక ఇంతకున్ముందు ప్రభాస్ కూడా ఛత్రపతి సినిమాలో షార్క్ తో ఫైట్ చేస్తూ కనిపించాడు…కాబట్టి ఈ ఫైట్ దానికి మించి ఉంటుందని ఎన్టీయార్ అభిమానులు ఇప్పటికే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈ సినిమా తో పాన్ ఇండియా లెవల్లో ఒక సూపర్ హిట్ కొట్టడానికి ఎన్టీయార్ రెఢీ గా ఉన్నట్టు తెలుస్తుంది…ఇక ఈ సినిమా లో ఒక స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శృతిహాసన్ ( Shruti Haasan )ని తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది ఇప్పటికే శృతి హాసన్ మహేష్ బాబు హీరో గా చేసిన ఆగడు సినిమా లో స్పెషల్ సాంగ్ చేసి అందరిని ఆకర్షించింది ఇక కొరటాల తో కూడా ఆమెకి మంచి ర్యపో ఉంది ఎందుకంటే వీళ్ళ కాంబో లో శ్రీమంతుడు మూవీ వచ్చింది కాబట్టి ఇక అందుకే ఆమె ని ఈ సినిమాలో కూడా తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి…
.







