మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ లో రేపు జరగాల్సిన హెచ్ఎండీఏ లే అవుట్ ల వేలం రద్దు అయిందని తెలుస్తోంది.బోడుప్పల్ లో 50 ఫ్లాట్లు వేలం వేసేందుకు హెచ్ఎండీఏ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.
అయితే సదరు భూములపై కోర్టులో పిటిషన్ దాఖలు కావడంలో హెచ్ఎండీఏ వేలాన్ని ఉపసంహరించిందని సమాచారం.అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో వేలం రద్దు చేస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది.
కోర్టులో పిటిషన్ పై విచారణ జరిగిన అనంతరం మళ్లీ లే అవుట్ ల వేలం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటీవల నిర్వహించిన కోకాపేట నియో పోలీస్ ఫేజ్ -2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే భూములు రికార్డు స్థాయిలో ధర పలకగా పదవ నంబర్ ఫ్లాట్ లో ఎకరం ధర రూ.100 కోట్ల మార్క్ దాటిన సంగతి తెలిసిందే.