జీహెచ్ఎంసీ అనుమతి తర్వాతే నిర్ణయాలు..: మంత్రి కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.ఏ శాఖ అధికారులైనా జీహెచ్ఎంసీ అనుమతి తరువాతే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

 Decisions Only After Ghmc Approval..: Minister Ktr-TeluguStop.com

జవహర్ నగర్ డంప్ యార్డు ఎనిమిది వేల టన్నులు దాటి పోయిందన్న కేటీఆర్ డంప్ యార్డుల కోసం భూమిని గుర్తించాలని రంగారెడ్డి, సంగారెడ్డి మరియు యాదాద్రి భువనగిరి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారని తెలుస్తోంది.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డంప్ యార్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు.

చెత్తను వేరు చేసేందుకు, విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ మేరకు వ్యవసాయానికి యోగ్యతలేని భూములను గుర్తించాలన్న మంత్రి కేటీఆర్ క్వారీలను ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.

దుండిగల్, ఖానాపూర్, ప్యారానగర్ డంప్ యార్డుల అంశంలో వారం రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా సి అండ్ డి ప్రైవేట్ డంప్ యార్డ్ నిర్వాహకులపై కఠినంగా వ్యవహరించాలన్నారు.

అవసరం అయితే పోలీస్ కేసు పెట్టాలని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube