బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతున్న తల్లి కూతుర్లు.. ఈసారి రచ్చ మామూలుగా ఉండదు?

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం వివిధ భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

 Mother And Daughters Entering Bigg Boss, Bigg Boss, Social Media, Nagarjuna , Vi-TeluguStop.com

తెలుగులో ఇప్పటికే ఆరు సీజన్లని పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతుంది.ఇక ఈ సీజన్ కి కూడా నాగార్జున ( Nagarjuna ) వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేస్తున్నారు.

ఇకపోతే ఈసారి మాత్రం ఈ షో చాలా కొత్తగా ఉండబోతుందని నాగార్జున తెలియజేశారు.దీంతో ఈ కార్యక్రమం పై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.అదేవిధంగా ఈసారి ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ఈసారి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వారిని మాత్రమే హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ ల గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి నటి సురేఖ వాణి( Surekha Vani ) ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.అయితే గత కొన్ని సీజన్లుగా సురేఖ వాణి ఈ కార్యక్రమంలో పాల్గొనవుతున్నారని వార్తలు రావడం తాను పాల్గొనలేదంటూ సురేఖ వాణి క్లారిటీ ఇవ్వడం జరుగుతూనే ఉంది.అయితే ఈసారి మాత్రం ఈమె సినిమాలను కాస్త తగ్గించి ఎక్కువగా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు.

దీంతో మరింత ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బిగ్ బాస్ మేకర్స్ ఈమెను ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్ గా ఆహ్వానించబోతున్నారని తెలుస్తోంది.

మరి సురేఖ వాణి తో పాటు తన కూతురు సుప్రీత ( Supritha ) కూడా ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.దీంతో ఈమె కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మరి సురేఖ వాణి సుప్రీత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube