రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) గంభీరావుపేట మండల కేంద్రంలో తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, స్వరాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్( Professor Jayashankar ) అన్నారు గంభీరావుపేట అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి నీ పురస్కరించకుని వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.
తెలంగాణ నే ఆశ, శ్వాసగా జీవించి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం( Telangana Movement )లో కొట్లాడి మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధనకు ఆచార్య జయశంకర్ మార్గదర్శనం చేశారన్నారు.
ఆచార్య జయశంకర్ మన మధ్య లేనప్పటికీ.అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వెల్లడించారు.
ఆచార్యుని ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల విశ్వకర్మలు, తదితరులు పాల్గొన్నారు
.






