ఆస్ట్రేలియాలో సిక్కు విద్యార్ధులకు బిగ్ రిలీఫ్.. ఇకపై కిర్పాన్‌ను తీసుకెళ్లొచ్చు, కోర్ట్ సంచలన తీర్పు

సిక్కులు తమ మత విశ్వాసాలను తూచా తప్పకుండా పాటిస్తారు.ప్రాణాలు పోయినా సరే వాటిని విడిచిపెట్టరు.

 Sikhs In Australia's Queensland Can Carry Kirpan In Schools, Here Is What The Co-TeluguStop.com

తలపాగా, గడ్డం, చిన్న కత్తి అన్నవి సిక్కు మతాన్ని అనుసరించే మగవాళ్లు ఖచ్చితంగా ఫాలో అవుతారు.ఏ దేశమేగినా ఎందుకాలిడినా సిక్కు మతస్తులు తమ సంస్కృతీ సంప్రదాయాలను ఏమాత్రం మరచిపోరు.

విడిచిపెట్టరు.విదేశాలలో స్థిరపడి ఉన్నతస్థాయిలోకి చేరుకున్నా సరే వారి మూలాలను ఏమాత్రం వదలరు.

అయితే ఈ కట్టుబాట్లే ఒక్కొక్కసారి వీరిని సమస్యలకు గురిచేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ సుప్రీంకోర్ట్( Supreme Court of Queensland, Australia ) సిక్కులకు శుభవార్త చెప్పింది.

సిక్కు విద్యార్ధులు పాఠశాల మైదానంలో కిర్పాన్( చిన్న కత్తి)ని తీసుకెళ్లడం రాజ్యాంగ విరుద్ధమంటూ పేర్కొన్న చట్టాన్ని రద్దు చేసింది.సిక్కులు తమ విశ్వాసంలో భాగంగా ఎల్లవేళలా తీసుకువెళ్లాల్సిన ఐదు మత చిహ్నాలలో ఒకటైన కిర్పాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడం వివక్ష చూపడమేనంటూ కమల్‌జిత్ కౌర్ అథవాల్ గతేడాది కోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం అథవాల్‌కు( Athaval ) అనుకూలంగా తీర్పునిస్తూ.జాతి వివక్ష చట్టం ప్రకారం కిర్పాన్‌ను ధరించకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

Telugu Athaval, Australia, Kirpan, Sikhsaustralias-Telugu NRI

ఈ తీర్పుపై క్వీన్స్‌లాండ్ విద్యాశాఖ స్పందిస్తూ.కోర్టు నిర్ణయం వల్ల కలిగే చిక్కులను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.వ్యక్తులు తమ మతాన్ని ఆచరించడానికి , విద్యార్ధి, ఉపాధ్యాయుల భద్రతతో పాటు వారి విశ్వాసాన్ని వ్యక్తీకరించడానికి , వారి మానవ హక్కులను సమతుల్యం చేయడం కోర్టుకు చాలా క్లిష్టమైన పని అని అథవాల్ న్యాయవాది అన్నారు.ఈ రోజు సిక్కు మతానికి చెందిన సభ్యులు తమ విశ్వాసాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చు.

స్థానిక పాఠశాల కమ్యూనిటీలలో ఎలాంటి వివక్ష లేకుండా సానుకూలంగా పాల్గొనవచ్చు అని న్యాయవాది తెలిపారు.

Telugu Athaval, Australia, Kirpan, Sikhsaustralias-Telugu NRI

కిర్పాన్( Kirpan ) .అనేది సిక్కు మతంలో అంతర్భాగం.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 సిక్కు వ్యక్తులు కిర్పాన్‌లు ధరించడానికి అనుమతిస్తుంది.

ఇది సిక్కు మతంలోని ఐదు కాకర్లలో ఒకటి.(కేష్, కంగ, కారా, కచేర, కిర్పాన్‌లను కాకర్లుగా) పిలుస్తారు.

న్యాయం , దాతృత్వం, నైతికత, వినయం, సమానత్వం, విశ్వాసం వంటి సిద్ధాంతాలపై నిబద్ధతకు గుర్తుగా వాటిని ధరిస్తారు.పగలు కానీ రాత్రి కానీ ఏ సమయంలోనైనా కిర్పాన్‌ను ధరించకపోవడం సిక్కు మతంలో ఘోరమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube