టాలీవుడ్ నటి పూర్ణ( Poorna ) గురించి అందరికీ తెలిసిందే.అప్పట్లో హీరోయిన్గా కొంతకాలం ఓ వెలుగు వెలిగింది.
శ్రీ మహాలక్ష్మి సినిమా( Sri Mahalaxmi ) తో తొలిసారిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా అవును సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక కొన్ని సినిమాలలో అంతగా మెప్పించలేకపోయింది.దాంతో మళ్లీ టాలీవుడ్ లో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.
కేవలం వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై ఢీ డాన్స్ షో లో జడ్జి గా చేసి బాగా సందడిగా చేసింది.ఇందులో వచ్చీ రాని తెలుగు భాషతో మాట్లాడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
పైగా ఇందులో తాను ప్రవర్తించిన తీరు కూడా అందర్నీ ఆశ్చర్య పడేలా చేసింది.నిజానికి ఇందులో ఈమె హగ్గు లతో, ముద్దులతో, బుగ్గలు కొరకడం లాంటి వాటితో బాగా రెచ్చిపోయింది.
ఈమె ఇలా చేయటం వల్ల ఢీ షో బాగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది.

ఇక ఇప్పుడు బుల్లితెరకు కూడా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.ఆ మధ్యనే షానిద్ అసిఫ్ అలీ( Shanid Asif Ali ) అనే బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకుంది.ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రీసెంట్ గానే పండంటి బాబుకి జన్మనిచ్చింది.
ఇక పూర్ణ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉంటూ కూడా తన సోషల్ మీడియా( Social media ) వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.
లేటు వయసులో కూడా అందాల విందు చేస్తుంది పూర్ణ.

నిత్యం ఏదో ఒక ఫోటో షూట్ అందరి దృష్టిలో పడుతుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇక అందరిలాగా కాకుండా తన బాబు ఫోటోను అందరికి చూపించేసింది.
అయితే ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తను ఒక మ్యారేజ్ లో కనిపించింది.అందులో అందంగా రెడీ అయిన పూర్ణ తన కొడుకుని ఎత్తుకొని ఉంది.
బాబు చాలా క్యూట్ గా ఉండటమే కాకుండా బాబు కూడా తొందరగా ఎదిగినట్లు అనిపించింది.ఇక బాబు ఫోటో ని చూసి అందరూ పూర్ణ లాగా కాకుండా కనీసం తన భర్త లాగా కాకుండా అచ్చం వాళ్ళ నానమ్మ పోలికలతో ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఏదైతే ఏంటి మొత్తానికి ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకోగా పెళ్లి చేసుకొని బాబును కానీ మంచి జీవితాన్ని ఎంజాయ్ చేస్తుందని చెప్పాలి.ఇక మళ్ళీ సినీ ఇండస్ట్రీకి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో తెలియదు కానీ ఆమె అభిమానులు మాత్రం ఆమెను మరోసారి సినిమాలలో చూడాలని కోరుకుంటున్నారు.ఆ మధ్యనే దసరా సినిమాతో ప్రేక్షకులను ముందుకు రాగా అందులో హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా ఒక చిన్న పాత్రలో చేసింది పూర్ణ.







