వాహనదారులకు అదిరిపోయే న్యూస్.. సమస్త సమాచారం అందించే రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్ లాంచ్...

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హైవేపై వెళ్లే వాహనదారుల కోసం ‘రాజ్‌మార్గ్‌ యాత్ర’( Rajmargyatra App ) అనే కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించింది.ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.

 Nhai Launches Rajmargyatra App To Enhance Convenience Of National Highway Users-TeluguStop.com

రియల్-టైమ్ వెదర్ కండిషన్స్, సమయానుకూల బ్రాడ్ క్యాస్ట్ నోటిఫికేషన్లు, సమీపంలోని టోల్ ప్లాజాలు, పెట్రోల్ పంపులు, ఆసుపత్రులు, హోటళ్లు, ఇతర అవసరమైన సేవల గురించిన వివరాలు, అలాగే ఇన్‌బిల్ట్ ఫిర్యాదుల పరిష్కారం, ఎస్‌కలేషన్ మెకానిజంతో సహా రాజ్‌మార్గ్‌ యాత్ర అనేక రకాల ఫీచర్‌లను అందిస్తుంది.

హైవే సంబంధిత సమస్యలను నివేదించడానికి, మెరుగైన స్పష్టత కోసం జియో-ట్యాగ్ చేసిన వీడియోలు లేదా ఫోటోలను జోడించడానికి కూడా యాప్ వినియోగదారులను అనుమతిస్తుంది.

ఫిర్యాదు సమర్పించిన తర్వాత, అది పరిష్కరించబడే వరకు NHAI దానిని ట్రాక్ చేస్తూ, పర్యవేక్షిస్తుంది.జాతీయ రహదారులపై( National Highways ) ప్రయాణించే ఎవరికైనా రాజ్‌మార్గ్‌ యాత్ర విలువైన యాప్ గా నిలుస్తుంది.

Telugu Fastag, Highway, India, Journey, Latest, Nationalhighway, Nhai, Travel, T

యాప్ సురక్షితమైన ప్రయాణంలో అవసరమైన సమాచారం, సేవలను అందిస్తుంది.ఇది హిందీ, ఇంగ్లీష్ రెండింటిలోనూ అందుబాటులో ఉంది.జాతీయ రహదారులపై ప్రయాణించే ఎవరికైనా రాజ్‌మార్గ్‌ యాత్ర ప్రయాణాన్ని సురక్షితంగా, మరింత ఆనందదాయకంగా, అవాంతరాలు లేకుండా చేయడానికి సహాయపడుతుంది.జాతీయ రహదారిపై ట్రిప్ ప్లాన్ చేస్తుంటే, ఫ్రీగా లభించే రాజ్‌మార్గ్‌ యాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.

Telugu Fastag, Highway, India, Journey, Latest, Nationalhighway, Nhai, Travel, T

‘రాజ్‌మార్గ్‌ యాత్ర’ అప్లికేషన్‌ ద్వారా ఫాస్టాగ్ సేవలను( Fastag ) కూడా పొందవచ్చు.వాహనదారులు తమ ఫాస్టాగ్‌లను రీఛార్జ్ చేయడానికి, మంత్లీ పాస్‌లను పొందేందుకు, యాప్‌లో ఇతర సంబంధిత బ్యాంకింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి ఈ అప్లికేషన్ వీలు కనిపిస్తుంది.ఓవర్-స్పీడ్ గా వెళ్తుంటే యాప్ అలర్ట్ నోటిఫికేషన్లను కూడా పంపుతూ సురక్షితమైన డ్రైవింగ్ ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube