తల్లితో కలిసి మేకలు కాసేందుకు వెళ్లిన 14 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయి, తాజాగా గురువారం ఉదయం ఇటుక బట్టీలో కాలిన శరీరంతో కనిపించడంతో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.రాజస్థాన్( Rajasthan ) లోని జైపూర్ సమీపంలో ఉండే భిల్వారా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక బుధవారం తన తల్లితో కలిసి మేకలు కాసేందుకు పొలానికి వెళ్ళింది.
కొద్దిసేపటి తర్వాత తల్లికి కనిపించకుండా పోయింది.ఎంతసేపు ఎదురు చూసినా ఆ బాలిక జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కూడా ఆ బాలిక కోసం రాత్రంతా చుట్టుపక్కల ప్రాంతాలను గాలించారు.
తాజాగా గురువారం తెల్లవారుజామున ఆ బాలిక ఇంటికి సమీపంలో ఉండే ఇటుక బట్టీ( Brick kiln )లో కాలుతున్న మృతుదేహాన్ని స్థానికులు గుర్తించారు.వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పక్కనే వెండి పట్టి, చెప్పులను గుర్తించారు.
వాటి ఆధారంగా ఆ మృతదేహం ఆ బాలికదే అని భావిస్తున్నారు.

బాలిక హత్యకు ముందు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులు( Police ) అనుమానిస్తున్నారు.ఆ ప్రాంతంలో ఉండే ముగ్గురు అనుమానితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.14 ఏళ్ల బాలిక ఇలా అత్యాచారానికి గురై ఇటుక బట్టీలో కాలిన మృతదేహంతో కనిపించడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.కుటుంబ సభ్యులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికంగా రాజకీయ దూమారం లేపుతోంది.
త్వరలోనే అన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.







