ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే అందులో నటించిన ఏదో ఒక కీలక పాత్రకి మంచి పేరు రావడం సహజంగా చూస్తూనే ఉంటాం.అందులో నటించిన హీరోయిన్లకొ క్యారెక్టర్ ఆర్టిస్టులకొ మంచి గుర్తింపు వచ్చి వారికి అవకాశాలు పెరుగుతాయి.
అయితే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన బ్రో మూవీ( Bro Movie ) రిలీజ్ అయిన తర్వాత కేవలం అందులో రెండు నిమిషాల కన్నా తక్కువ నిడివు ఉన్న ఒక పాత్ర పై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది .అది నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబును( Minister Ambati Rambabu ) పోలి ఉన్నదని ఆయన ప్రెస్మీట్ పెట్టేవరకు చాలామంది జనాలకు తెలియదంటే అతిశయోక్తి కాదు ఆ సినిమా తర్వాత ఆయన స్పందన, దానిపై మీడియాలో జరిగిన చర్చతోనే అది ఆయన పోలి ఉన్నదని చాలామంది గ్రహించారు.
అయితే సందర్భం లేకుండా ఇలాంటి పాత్రను సృష్టించడం మేకర్ ల తప్పు అయితే కేవలం తన స్టైల్ ని ఫాలో అయ్యారే తప్ప తన గురించి పెద్ద విమర్శలు కూడా చేయని అంతటి చిన్న విషయాన్ని గురించి కనీస స్పందనతో పక్కన పెట్టాల్సిన మంత్రిగారు కూడా దానిపై రాష్ట్ర వ్యాప్త చర్చ జరగడంలో కీలకపాత్ర పోషించినట్లుగా చెప్పవచ్చు .పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే వరకు పరవాలేదు కానీ దానిపై ఈడీ కి ( ED ) కంప్లైంట్ చేసే వరకు వెళ్తామన్న ఆయన వ్యాఖ్యలపై మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .రాష్ట్ర అభివృద్ధికి కీలకమయిన చాలా అంశాలపై ఢిల్లీకి వెళ్లి ప్రశ్నించే తీరికలేదు, కానీ ఒక సినిమా కలెక్షన్ల పై కంప్లైంట్ చేస్తాను అన్న మంత్రి గారు తీరుపై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .

అంతేకాకుండా అంబటి వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న జనసైనికులు( Janasena ) కూడా ఎక్కడి కక్కడ ఆయనను ట్రోల్ చేస్తూ ఆయనపై సినిమా తీస్తామంటూ రకరకాల ప్రకటనలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.చూస్తుంటే ఈ వ్యవహారం అంబటి తెగేదాకా లాగుతున్నట్లే కనిపిస్తుంది.ఇక్కడ ఈ ఇరు వర్గాలలో ఎవరో ఒకరు వదిలేస్తే తప్ప ఈ వ్యవహారం చల్లారేలా కూడా కనిపించడం లేదు.
ఈ మొత్తం వ్యవహారం టీ కప్పులో తుఫానులా తేలిపోవలసిన విషయాన్ని ఇంత దాకా తెచ్చిన మంత్రిగారి వైపే మెజారిటీ వేళ్ళు చూపిస్తున్నాయి.

నిజానికి ఆయన కాస్త లౌక్యంగా వ్యవహరించి ఉండి కొన్ని రకాల విమర్శలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం వైసీపీ( YCP ) శ్రేణుల నుండి వినిపిస్తుంది .తన పాత్ర వల్లే సినిమా ఈ స్థాయిలో ఆడిందని లేకపోతే తనను అనుకరించకపోతే సినిమాకు భవిష్యత్తు లేదనో ఆయన ఒక మాట అని సరిపెట్టు ఉంటే కనీసం కౌంటర్ అయినట్టు ఉండేది అలా కాకుండా దానిపై విదేశీ ఆర్థిక మూలాలు ఉన్నాయి, తెలుగుదేశంతో లింకులు ఉన్నాయి, ఈడీకి కంప్లైంట్ చేస్తామన్న మాటలు మంత్రిగారి స్థాయికి తగినట్టుగా లేవంటూ అధికార పార్టీలోని కొందరు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది
.






