పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్( Pawan Kalyan, Sai Dharam Tej ) ముఖ్య పాత్రల్లో నటించిన బ్రో సినిమా ( Bro movie )భారీ ఎత్తున విడుదల అవ్వడం జరిగింది.సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా లో లీడ్ రోల్ లో నటించగా పవన్ కళ్యాణ్ కాస్త ఎక్కువ నిడివి ఉన్న గెస్ట్ పాత్రలో కనిపించాడు అనడంలో సందేహం లేదు.
హీరోగా పవన్ కళ్యాణ్ వరుస సినిమా లు చేస్తున్న ఇలాంటి సమయంలో ఇలాంటి సినిమా ను చేయడం అవసరమా అంటూ కొందరు కామెంట్స్ చేశారు.ఆ విషయం పక్కన పెడితే బ్రో సినిమా( Bro movie ) లో అంబటి రాంబాబు డాన్స్ అంటూ పేరడీ పెట్టడంతో పాటు కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ను పెట్టడంతో చర్చనీయాంశంగా మారింది.

ఇలాంటి పొలిటికల్ డైలాగ్స్ వల్ల అవతలి పార్టీ వారి నుండి నష్టం తప్పదు అనే విషయం తెలిసినా కూడా మేకర్స్ ఇలాంటి ప్రయత్నం చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు.అంబటి రాంబాబు ప్రస్తుతం బ్రో సినిమా ను చిన్నపాటి యుద్దమే ప్రకటించాడు.అంబటి రాంబాబు ఏకంగా ఢిల్లీ వెళ్లి మరీ ఈ సినిమా పై ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యాడు.మనీ ల్యాండరింగ్ జరిగింది అంటూ అంబటి ఆరోపిస్తూ ఐటీ శాఖ వారికి ఫిర్యాదు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లడం జరిగింది.
మొత్తానికి ప్రస్తుతం బ్రో సినిమా పై ఓ రేంజ్ లో వివాదం చెలరేగుతోంది.మరో వైపు ఏపీలో ఈ సినిమా టికెట్ల రేట్లు తగ్గించడం తో పాటు సినిమా ను నడవకుండా అధికార పార్టీ వారు చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం లో పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు.కానీ కొందరు సినీ విశ్లేషకులు మాత్రం సినిమా లు చేయాలి అనుకున్నప్పుడు రాజకీయాల్లో ఉన్న వారు సినిమా ల్లో రాజకీయాలు చూపించకుంటేనే మంచిది అనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ సాధారణంగా ఒక డైలాగ్ చెప్తేనే పొలిటికల్ గా రచ్చ అవుతుంది.అలాంటిది ఆయన సినిమా లో పొలిటికల్ డైలాగ్ ఉంటే రచ్చ మామూలుగా ఉంటుందా…! అందుకే రాజకీయాల్లో ఉన్న వారు సినిమాల్లో పొలిటికల్ డైలాగ్స్ పేల్చకుంటేనే ఉత్తమం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







