ఇండియాలో ఎక్కువమంది పురుషులు లుంగీలు( Lungi ) కట్టుకుంటారు.పెద్దవారు అయితే లుంగీలు, పంచెలు కట్టుకుంటారు.
ఇక యువకులు అయితే పల్లెటూర్లలో రాత్రిపూట లుంగీలు కట్టుకుంటారు.లుంగీలు తేలికగా ఉండటం వల్ల మన శరీరానికి కూడా బరువు అనిపించదు.
అంతేకాకుండా చెమట పట్టకుండా సౌకర్యవంతంగా ఉంటాయి.పల్లెటూర్లు, పట్టణాల్లో లుంగీలు కట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఉంటారు.
ఫంక్షన్లలో కూడా లుంగీలు కట్టుకుంటారు.
అయితే ఓ వ్యక్తి విదేశాల్లో( Foreign ) కూడా లుంగీలు కట్టుకుని తిరుగుతున్నాడు.దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక వ్యక్తి లుంగీ కట్టుకుని విదేశాల్లో బయట కూడా తిరుగుతున్నాడు.
లుంగీతోనే ఓ షాపింగ్ మాల్‌లోకి( Shopping Mall ) వెళ్లాడు.అక్కడ తనకు కావాల్సిన వస్తువులన్నింటినీ తీసుకున్నాడు.
వస్తువులను ట్రాలీలో వేసుకున్నాడు.షాపింగ్ పూర్తయిన తర్వాత బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్లి ట్రాలీని ఖాళీ చేశాడు.
ఆ తర్వాత బిల్లు తీసుకున్న తర్వాత కౌంటర్ పక్క నుంచి క్యారీ బ్యాగ్ బయటకు తీసుకున్నాడు.క్యారీ బ్యాగ్ తీసుకోవడంతో మాల్ సిబ్బంది అతడిని అడ్డుకున్నారు.
క్యారీ బ్యాగ్ కోసం డబ్బులు చెల్లించకుండా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.బిల్లు కట్టిన తర్వాత క్యారీ బ్యాగ్( Carry Bag ) ఇవ్వమని చెప్పారు.దీంతో అతడికి ఇక కోపం వచ్చింది.వెంటనే తన లుంగీని విప్పి నేలపై పరిచాడు.అనంతరం తాను కొన్న వస్తువులను అందులో వేసుకుని మూటకట్టుకున్నాడు.ఆ తర్వాత ఆ మూటను తీసుకుని బయటకు వెళ్లాడు.క్యారీ బాగ్ కోసం రూ.10 వరకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.కానీ క్యారీ బ్యాగ్ కు డబ్బులు ఎందుకు చెల్లించాలని భావించిన అతడు.ఇలా దేశీ జూగాడ్ ను( Desi Jugad ) తయారుచేశాడు.ఇతడు ఉపాయం అందరినీ ఆకర్షిస్తోంది.విదేశీ గడ్డపై మన సత్తా చూపించాడని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఐడియా బాగుందని మరికొందరు అంటున్నారు.