పాపం జూపల్లి.. ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుందే ?

బి‌ఆర్‌ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ), జూపల్లి కృష్ణరావులు గత కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.గత ఆర్నెళ్లుగా వీరిద్దరు ఏ పార్టీలో చేరతారు ? అనే చర్చ ఎంతో ఆసక్తిగా సాగింది ఎట్టకేలకు వీరిద్దరు కూడా కాంగ్రెస్ వైపే అడుగులు వేశారు.గత నెల రెండో తేదీన ఖమ్మం జిల్లా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు పొంగులేటి.పార్టీ తీర్థం పుచ్చుకున్న వెంటనే ఆయనకు ఎన్నికల ప్రచార కమిటీ కో చైర్మెన్ బాధ్యతలను అప్పగించింది హస్తం హైకమాండ్.

 Is Jupalli Going To Join Congress, Jupally Krishna Rao, Ponguleti Srinivas Reddy-TeluguStop.com
Telugu Congress, Gurunath Reddy, Jupallykrishna, Priyanka Gandhi, Telangana-Poli

ఇక పొంగులేటితో పాటే కాంగ్రెస్ ( Congress party )వైపు అడుగులు వేసిన జూపల్లి కృష్ణరావు మాత్రం ఇంకా అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు.గత నెలలోనే కొల్లాపూర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరాలని భావించినప్పటికి సభ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది.మొదట జులై 15 ఆ తరువాత 21 మళ్ళీ 30 కి వాయిదా పడింది.అయితే 30 వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో సభ నిర్వహించాలని భావించినప్పటికి వర్షాల కారణంగా మళ్ళీ వాయిదా పడక తప్పలేదు.

దీంతో ఇప్పుడు సభ నిర్వహించలా లేదా అనే సందిగ్ధంలో హస్తం నేతలు ఉన్నట్లు తెల్సుతోంది.

Telugu Congress, Gurunath Reddy, Jupallykrishna, Priyanka Gandhi, Telangana-Poli

పైగా ప్రియాంకా గాంధీ( Priyanka Gandhi ) సభకు హాజరు కావడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది.దీంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆర్భాటంగా కాంగ్రెస్ లో చేరాలని భావించిన జూపల్లి కృష్ణరావుకు నిరాశ తప్పలేదు.ఇక చేసేదేమీ లేకా డిల్లీ వెళ్ళి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు జూపల్లి సిద్దమయ్యారు.

అందుకోసమే నేడు జూపల్లి డిల్లీ బయలు దేరారు.ఈయనతో పాటు పాలమూరు జిల్లాకు చెందిన గుర్నాథ్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, మేఘరెడ్డి వంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరానున్నారు.

మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత జూపల్లి కృష్ణరావుకు హైకమాండ్ ఎలాంటి బాధ్యతలు కట్టబెడుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube