ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.తెల్లవారుజామున శ్రీ శ్రీ సర్కిల్ వద్ద రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో మహిళలు తీవ్రంగా గాయపడటంతో వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.బాధిత మహిళలు ఖమ్మం నుంచి వైరా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







