నల్లగొండ జిల్లా: మునుగోడు మండల పరిధిలోని మునుగోడు కమ్మగూడం నుండి చౌటుప్పల్ కు వెళ్లే రెండు వరసల రోడ్డుపై చొల్లేడు, కొండాపురం వెళ్లే రోడ్డు కలిసే జంక్షన్ లో సూచిక బోర్డులు లేకపోవడంతో ఎటు వెళ్ళాలో తెలియక కంగారులో ప్రయాణికులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు.ఇక్కడ తరచుగా ప్రమాదాల జరగడంతో అనేకమంది కాళ్లు,చేతులు విరిగి అంగవైకల్యం బారిన పడుతున్నారు.
అయినా ఆర్ అండ్ బీ అధికారులు తమకేమీ పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉండడంపై ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి చొల్లేడు కొండపురం వెళ్లే రోడ్డు జంక్షన్ లో సూచిక బోర్డు ఏర్పాటు చేసి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు.
ఈ విషయమై ఆర్ అండ్ బీ మండల అధికారి పి.శిరిష్ కుమార్ ను వివరణ కోరగా చొల్లేడు కొండపురం రోడ్డుకు సూచిక బోర్డుకు ప్రపోజల్ పంపినామని,కానీ,సాంక్షన్ కాలేదని,రాగానే ఏర్పాటు చేస్తామని చెప్పారు.