Sreeleela Sri Reddy : శ్రీలీల శ్రీదేవి.. వైష్ణవి జయసుధ.. మరీ శ్రీరెడ్డి ఎవరంటూ నెటిజన్స్ ట్రోల్స్?

మామూలుగా కుర్ర హీరోయిన్స్ పర్ఫామెన్స్ బాగుంటే చాలు వెంటనే వారిని సీనియర్ హీరోయిన్లతో పోలుస్తూ ఉంటారు జనాలు.పైగా సీనియర్ స్టార్ హీరోయిన్లకు కుర్ర హీరోయిన్లకు దగ్గర పోలికలు ఉంటే చాలు వారికి జూనియర్ అని ట్యాగ్ పెట్టి సీనియర్ హీరోయిన్ల పేరుతో పిలుస్తూ ఉంటారు.

 Srileela Sridevi Vaishnavi Jayasudha Who Are The Netizens Trolling Sri Reddy-TeluguStop.com

అయితే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోయిన్స్ ను సీనియర్ స్టార్ హీరోయిన్ల పేర్లతో పిలుస్తున్నారు తమ అభిమానులు.

అయితే ఈ మధ్యనే ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఓరేంజ్ లో దూసుకెళ్తున్న శ్రీలీలను( Sreeleela ) కూడా ఒక స్టార్ సీనియర్ హీరోయిన్ తో పోలుస్తూ తమ అభిమానులు రచ్చ చేస్తున్నారు.మొదటి చూపుతోనే శ్రీ లీల అబ్బాయిలందర్నీ తన వైపుకు మలుపుకోవటమే కాకుండా వాళ్ళ మనసులో క్రష్ గా చేరిపోయింది.పైగా చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

అంతేకాదు నటన పరంగా కూడా మంచి టాలెంట్ డాన్స్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

దీంతో స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడి పై మనసు పారేసుకుని తమ సినిమాలలో అవకాశాలు ఇస్తున్నారు.ఇలా ఒకప్పుడు హీరోలు కూడా ఇటువంటి అభిమానులను ఒక హీరోయిన్ పై చూపించారు.ఇంతకు ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ శ్రీదేవి.

ఈమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.నటన గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే.

దీంతో శ్రీ లీల అభిమానులు తనని హీరోయిన్ శ్రీదేవి( Sridevi )తో పోలుస్తున్నారు.మనకు కాబోయే శ్రీదేవి శ్రీలీల అని ఓ వేదికలో నటుడు బ్రహ్మాజీ ఒక డైలాగ్ కొట్టాడు.

అయితే ఈ మధ్యనే బేబీ సినిమా( Baby movie ), తో ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న యూట్యూబర్ వైష్ణవి చైతన్య కూడా తొలిసారిగా హీరోయిన్గా అందరిని మెప్పించింది.దీంతో కుర్రాళ్లు ఈ బ్యూటీ ని కూడా క్రష్ లిస్టు లోకి చేర్చుకున్నారు.అయితే చిరంజీవి కూడా ఈ బ్యూటీ ని చూసి రాసి పెట్టుకోండి ఈ అమ్మాయి మరో జయసుధ అవుతుంది అని కామెంట్ చేశాడు.అయితే దీంతో వీరిద్దరినీ ఈ విధంగా ట్రోల్ చేయటంతో వెంటనే కొందరు ట్రోలర్స్ శ్రీ రెడ్డిని( Sri Reddy ) మధ్యలో లాగుతూ.

ఈ లెక్క ప్రకారం మనం శ్రీ రెడ్డిని సిల్క్ స్మిత అనుకోవచ్చు మాస్టారు అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.మామూలుగా శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు స్థానం లేదని అప్పట్లో బాగా రచ్చ రచ్చ చేసింది.దీంతో అవకాశాలు లేకపోయినా కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ టచ్ లో ఉంటూ బాగా వివాదాలు సృష్టిస్తూ ఉంటుంది.

దీంతో ఆ ఇద్దరినీ ఆ హీరోయిన్లతో పోల్చడంతో.శ్రీ రెడ్డిని తన అభిమానులు ముద్దుగా సిల్క్ స్మితతో పోల్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube