జమ్మూకశ్మీర్ లో పెను ప్రమాదం తప్పింది.బారాముల్లాలో శ్రీనగర్ జాతీయ రహదారిపై అనుమానాస్పద బ్యాగ్ తీవ్ర కలకలం సృష్టించింది.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సీఆర్ఫీఎఫ్ భద్రతాసిబ్బంది బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు.
తరువాత ట్రాఫిక్ ను నిలిపివేసిన భద్రతా సిబ్బంది ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు.







