బార్డ్‌ను నమ్మితే అంతే సంగతులు.. గూగుల్ ఉన్నత ఉద్యోగి కీలక వ్యాఖ్యలు

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌( Artificial Intelligence ) ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా చాట్ జీపీటీ వచ్చిన తర్వాత మిగిలిన సంస్థలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిశోధనలు చేస్తున్నాయి.

 If You Believe The Bard, That's All Google's Top Employee's Key Comments , Googl-TeluguStop.com

ఈ క్రమంలో గూగుల్ కూడా ఓ కీలక ముందడుగు వేసింది.బార్డ్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన చాట్ బాట్‌ను తీసుకొచ్చింది.

అయితే దీనిపై ఆ సంస్థకు చెందిన ఓ ఉన్నత ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు.బార్డ్‌ను పూర్తిగా నమ్మలేమని, అది ఇచ్చే సమాచారం 100 శాతం ఖచ్చితం కాదని అన్నారు.

ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు.ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు యూకే, ఐర్లాండ్( UK, Ireland ) గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ డెబ్బీ వైన్‌స్టెయిన్.

బార్డ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Telugu Bard, Employees, Google, Latest, Ups-Latest News - Telugu

బార్డ్‌తో పాటు వాస్తవానికి ఎవరైనా తాము తెలుసుకోవాలనుకునే సమాచారం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో( Google search engine ) క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందని డెబ్బీ వైన్‌స్టెయిన్ అన్నారు.బార్డ్ హోమ్‌పేజీ “తప్పని లేదా అభ్యంతరకరమైన సమాచారాన్ని ప్రదర్శించవచ్చు” అని పేర్కొన్నారు.ఇప్పుడు గూగుల్ యూకే ఎగ్జిక్యూటివ్ కూడా బార్డ్ చెప్పే సమాచారంపై ఆధారపడవద్దని వినియోగదారులను హెచ్చరించారు.

ముఖ్యంగా నిర్దిష్ట సమాచారం కోసం బార్డ్ పై ఆధారపడితే అది తప్పు సమాచారం అందించే అవకాశం ఉందన్నారు.కాబట్టి గూగుల్ సెర్చ్ చేయడమే ఉత్తమం ఉన్నారు.గూగుల్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ బార్డ్ చార్ట్ బాట్ ( Bard chart bot )మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.బార్డ్ కొన్ని సందర్బాలలో సమాచారం తప్పుగా ఇవ్వొచ్చని దాని హోం పేజీలోనే పేర్కొన్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

పలువురు గూగుల్ ఉద్యోగులు సైతం ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు.కాబట్టి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన ఏఐ చాట్ బాట్ బార్డ్‌ను రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube