నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టే ఎఫెక్టివ్ ఇంటి చిట్కాలు ఇవే!

నోటి దుర్వాసన.( Bad Breath ) చాలా మంది చాలా కామన్ గా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి.

 Effective Home Remedies To Get Rid Of Bad Breath!,bad Breath, Home Remedies, Lat-TeluguStop.com

ఈ సమస్యతో బాధపడుతున్న వారు నలుగురితో కలవలేరు.మాట్లాడటానికి కూడా ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు.

నోరు తెరిస్తే దుర్వాసన వస్తుందని తెగ భయపడుతుంటారు.ఎదుటివాళ్లు ఏమనుకుంటారో అని ఫీల్ అవుతుంటారు.

ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది మార్కెట్‌లో దొరికే మౌత్‌ ఫ్రెషనర్లను( Mouth Freshner ) వాడుతుంటారు.కానీ రసాయనాలతో నిండి ఉండే మౌత్ ఫ్రెషనర్లు వాడటం వల్ల పలు సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే అవకాశాలు ఉంటాయి.అందుకే సహజంగానే ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాలు అద్భుతంగా సహాయపడతాయి.

Telugu Bad Breath, Tips, Latest, Oral-Telugu Health

పుదీనా టీ.(Peppermint Tea ) నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.రోజుకు ఒకటి లేదా రెండుసార్లు పుదీనా టీను తీసుకుంటే బ్యాడ్ బ్రీత్ కంట్రోల్ అవుతుంది.అలాగే నోటి నుంచి దుర్వాసన వస్తుందని బాధపడుతున్న వారు ఏదైనా ఫుడ్ తిన్న వెంటనే మూడు లేదా నాలుగు పార్స్లీ ఆకులు నోట్లో వేసుకుని బాగా నమిలి తినాలి.ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

Telugu Bad Breath, Tips, Latest, Oral-Telugu Health

అలాగే కొన్ని కొన్ని పండ్లు బ్యాడ్‌ బ్రీత్ సమస్యను నివారించడానికి అద్భుతంగా సహాయపడతాయి.అటువంటి వాటిలో యాపిల్, పైనాపిల్, ఆరెంజ్ వంటివి ముందు వరసలో ఉన్నాయి.కాబ‌ట్టి, ఈ పండ్లను డైట్ లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నించండి.

యాలకులు( Elachi ) కూడా బ్యాడ్ బ్రీత్ను కంట్రోల్ చేస్తాయి.ఆహారం తీసుకున్న తర్వాత ఒక ఇలాచీ నోట్లో వేసుకుంటే చెడు వాసన రాకుండా ఉంటుంది.

Telugu Bad Breath, Tips, Latest, Oral-Telugu Health

ఇక ఒక గ్లాస్‌ గోరు వెచ్చని వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసి మిక్స్ చేసి.ఆ వాటర్ తో మౌత్ వాష్ చేసుకోవాలి.ఆపిల్ సైడర్ వెనిగర్ లేదు అనుకుంటే బేకింగ్ సోడాను కూడా వాడవచ్చు.ఇలా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు చేస్తే నోటి దుర్వాసన సమస్యకు దూరంగా ఉండవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube